శేఖర్ కమ్ముల మలిచిన సూపర్ హిట్ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘ఫిదా’. ఈ సినిమాలో సాయిపల్లవి తన అసాధారణ నటనతో అందరినీ ఫిదా చేసేసింది. అందులో ఆమె హైలైట్ అవడానికి దోహదపడిన అంశాల్లో తెలంగాణా యాక్సెంట్ ఒకటి. తనకి భాష తెలియక పోయినా.. దర్శకుడి సహకారంతో తెలంగాణా యాసను పెర్ఫెక్ట్ గా పలికి.. శభాష్ అనిపించుకుంది ఆమె. దానికోసం ఆమె తెలుగులో తన పాత్రకు ఓన్ డబ్బింగ్ చెప్పుకుంది కూడా. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో భామ కూడా వచ్చి చేరుతోంది. ఆ అమ్మడు మరెవరో కాదు. ‘ఉప్పెన’ బ్యూటీ, బేబమ్మ కృతి శెట్టి.
‘ఉప్పెన’ మూవీతో తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది కృతి శెట్టి. ఈ సినిమా అంతలా హిట్టవ్వడానికి ఆమె రూప లావణ్యం కూడా ఓ కారణం. అలాంటి ఆ తుళు సుందరి.. తన రెండో ప్రయత్నంగా ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు నటిస్తోన్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే మూవీలో కథానాయికగా నటిస్తోంది.
అందులో పాత్ర ప్రకారం ఆమె పక్కా హైద్రాబాద్ అమ్మాయట. దాని కోసం ఆమె తెలంగాణా స్లాంగ్ ను నేర్చుకుంటోందని వార్తలొస్తున్నాయి. మంగళూర్ కు చెందిన ఈ సుందరికి కన్నడ, తుళు తప్ప వేరే ఇతర భాషలు అంతగా తెలియవు. అయినప్పటికీ.. దర్శకుడి చొరవతో అమ్మడు తెలంగాణా యాక్సెంట్ నేర్చుకోడానికి ముందుకొచ్చిందట. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించింది ఈ సినిమా యూనిట్. మరి ఈ మూవీతో బేబమ్మ తెలంగాణా యాస ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
Must Read : కృతిశెట్టి రెమ్యూనరేషన్ ఎంత పెంచిందో తెలుసా?