స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కి ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. టాలీవుడ్ లోనే కాకుండా మాలీవుడ్ లో సైతం విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే అక్కడ బన్నీ సినిమాలకు విశేషాదరణ లభిస్తుంటుంది. ఇప్పుడు.. బన్నీ సౌత్ లోనే కాకుండా నార్త్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా బన్నీ డ్యాన్స్ లకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇంచా చెప్పాలంటే.. బన్నీ డ్యాన్స్ కి బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతుంటారు.
సోషల్ మీడియా ద్వారా బన్నీ డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో తెలియచేస్తుంటారు. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ లిస్ట్ లో బాలీవుడ్ బ్యూటీ చేరింది. ఎవరా బాలీవుడ్ బ్యూటీ అంటారా.? సయీ మంజ్రేకర్. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో ‘దబాంగ్ 3’ మూవీలో నటించింది. ప్రస్తుతం అడివి శేష్ నటిస్తున్న ‘మేజర్’ చిత్రంలో నటిస్తోంది. అలాగే మెగా హీరో వరుణ్ తేజ్ ‘గని’ సినిమాలో నటిస్తోంది. ఈ అమ్మడు ఇటీవల బన్నీ లేటెస్ట్ మూవీ ‘అల.. వైకుంఠపురములో’ సినిమా చూసిందట. అంతే.. బన్నీ యాక్టింగ్.. డ్యాన్స్ తెగ నచ్చేసిందని చెప్పింది.
అంతే కాకుండా… బన్నీతో కలిసి నటించాలి అని డిసైడ్ అయ్యిందట. తన మనసులో మాటలను ఓ ఇంటర్ వ్యూ ద్వారా బయటపెట్టింది. బన్నీ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ చేస్తున్నారు. ఇందులో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. ఈ సినిమా తర్వాత బన్నీ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేయనున్నారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే. మరి.. ఈ సినిమాలో బన్నీ సరసన నటించే ఛాన్స్ దక్కిచుంకుంటుందేమో చూడాలి.
Must Read ;- కొరటాల మూవీలో బన్నీ జోడీ ఈ బ్యూటీనా?