గత ఏడాది సరిగ్గా ఈ టైమ్ కు ప్రారంభమైన కరోనా వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు సెకండ్ వేవ్ మొదలైంది. ఈ క్రమంలో కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీస్ కు చెందిన పలువురు ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. బాలీవుడ్ లో అయితే.. ఇప్పటికీ కరోనా సోకిన వారి సంఖ్య పెరుగుతోంది.
రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, హీరో అక్షయ్ కుమార్ లకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవగా.. ప్రస్తుతం వారు హోమ్ క్వారంటైన్ లో వైద్యులు సూచనల్ని ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ బ్యూటీ నివేదా థామస్ కూడా కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. రీసెంట్ గా నివేదా.. అంజలి, అనన్య నాగళ్ళతో కలిసి వకీల్ సాబ్ డబ్బింగు కార్యక్రమాలు పూర్తి చేసింది. ఆ తర్వాతే ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడం గమనార్హం. ఈ విషయాన్ని నివేదా థామస్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియచేసింది.
నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం నేను హోం క్వారంటైన్ లో ఉన్నాను. డాక్టర్ల సలహాలు పాటిస్తున్నాను. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో బైటికి వస్తాను. ముఖ్యంగా నాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న మెడికల్ టీమ్ కు ధన్యవాదాలు. ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించి క్షేమంగా ఉండండి అని ట్వీట్ చేసింది.
Also Read :











