ఈ ఫొటోలు చూశారా… ఒక మనిషి ఏనుగును మోయడం ఎలా సాధ్యం..అని అనుకుంటున్నారా.. అవును సాధ్యమే అంటాడు ఈ ఫ్రెంచ్ ఆర్టిస్టు ఫాబియన్ మెరెల్లె. ఫాబియన్ కు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా వాటర్ కలర్స్ తో చిత్రాలు వేస్తుంటాడు. రియలిస్టక్ గా చిత్రాలు గీయడమే ఈయన ప్రత్యేకత. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఫాబియన్ చిత్రాలకు మంచి పేరుంది. చాలామంది కళలు అంటే భయపడతారు. కానీ ఫాబియన్ కు కళలతో పాటు కలలనూ ఇష్టపడతాడు. తనకొచ్చే కలలను చిత్రాలుగా మలుస్తుంటాడు. ఇలా ఊహకందని చిత్రాలు వేస్తూ ప్రతిఒక్కరినీ ఆలోచింపచేసేలా చేస్తున్నాడు. పెద్ద ఎత్తున శిల్పాలను తయారుచేస్తూ బహిరంగ ప్రదేశాల్లో పెడుతుంటాడు. ఆయన శిల్పాలను చూసినవాళ్లు ఎవరైనా సరే సెల్ఫీలు తీసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తారు.
Also Read : సోనూ సూద్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్










