Home Remedies To Increase Hair Volume :
జుట్టు రాలడం… పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. నిత్యం ఏవో చిట్కాలు పాటిస్తూ ఉపశమనం పొందుతుంటారు. అయినా జుట్టురాలడం తగ్గడం లేదని తెగ బాధపడిపోతుంటారు. అయితే జుట్టును అతిగా దువ్వడం కూడా రాలిపోవడానికి కారణమవుతుందట.
అతిగా దువ్వితే..
కొంతమంది అదేపనిగా జుట్టును తెగ దువ్వేస్తుంటారు. అలా ఎక్కువ సార్లు దువ్వడం వల్ల వెంట్రుకలు ఊడిపోతాయి. ఎనిమిది తొమ్మిది సార్ల కంటే ఎక్కువ దువ్వక్కరలేదు. అతిగా దువ్వితే జుట్టు లాగినట్లుగా అవుతుంది. జుట్టు కుదుళ్లు పాడవుతాయి. జుట్టు కొసలు చిట్లుతాయి. జుట్టుకి ఎలాంటి దువ్వెన వాడాలో తెలియకపోతే వెంట్రుకలు కూడా బాగా ఊడిపోతాయి. దీని కోసం ఒత్తుగా, కర్లీగా ఉన్న జుట్టుకి పళ్ళు వెడల్పుగా ఉన్న దువ్వెన కావాలి. బాగా చిక్కు పడే జుట్టుకి బ్రష్‌ను ఎంచుకోవాలి. హెయిర్ టైప్‌ని బట్టి దువ్వెన ఎంచుకోవడం మంచిది.
జుట్టు రక్షణకు..
వారంలో రెండు రోజులకు ఒకసారైనా తలస్నానం చేయాలి. ముఖ్యంగా తలస్నానం వేడినీళ్లు వాడకూడదు. చల్లని లేదా గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఎక్కువ వేడిగా ఉన్న నీటిని స్నానానికి ఉపయోగిస్తే.. జుట్టు మరింత ఎక్కువగా రాలిపోతుంది. తలస్నానం చేసిన తరువాత జుట్టును బాగా ఆరబెట్టుకోవాలి. లేదంటే టవల్‌తో తుడుచుకోవాలి. కానీ, హెయిర్ డ్రయర్‌ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదు. వాడితే జుట్టు చివర్లో వెంట్రుకలు చిట్లి.. రంగుమారి.. రాలిపోతుంటాయి. దాంతో పాటు జుట్టు మృదుత్వాన్ని కోల్పోతుంది. తలస్నానానికి ముందు నూనె పెట్టడం వల్ల జుట్టు చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది.
Must Read ;- నోటి శుభ్రత పాటిద్దాం.. కరోనాకు చెక్ పెట్టేద్దాం!










