శేఖర్ రెడ్డి యెర్ర ( ’90 ఎంఎల్’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ తో పాటు చిత్ర నిర్మాణం పట్ల అభిరుచి కలిగిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ నెం.3గా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో గురువారం మొదలయ్యింది. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరిలపై తీసిన తొలి సన్నివేశానికి దర్శకుడు బాబీ క్లాప్ నిచ్చారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచే ఆరంభమైంది. పూర్తి వినోదాత్మక కుటుంబ కథాచిత్రంగా దీనిని మలచనున్నామని దర్శకుడు తెలిపారు.
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో అదుర్స్ రఘు, రవిప్రకాష్, సునయన తదితరులు తారాగణం. ఈ చిత్రానికి పాటలు: చంద్రబోస్, సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్, ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్, ఆర్ట్: జి.ఎం. శేఖర్, ఫైట్స్: వెంకట్, నిర్మాత: కె. నిరంజన్ రెడ్డి.
Must Read ;- కేపర్ కామెడీతో శ్రీవిష్ణు కొత్త చిత్రం