ఎన్నికల పోలింగ్ ముగియగానే రాజకీయ పార్టీలతోపాటు, ఓటర్లు సైతం ఎగ్జిట్ పోల్స్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎన్నికల్లో గెలిచే పార్టీ ఎది? ఓటమిని చవిచూసేది ఏది? ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? అని ఆయా సర్వే సంస్థలు, టీవీ ఛానెళ్లు తమ అంచనాలను సర్వేల్లో బయటపెడతాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఓటర్లే కాదు రాజకీయ పార్టీలు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బేరీజు వేసుకొని ఫలితాలపై ఒక అంచనాకు వస్తుంటారు.
ఇంత ఆసక్తిగా ఎదురు చూసే ఎగ్జిట్ ఫలితాలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. జరిగిన ఒకే ఒక తప్పిదం కారణంగా ఈ నిషేధం అముల్లోకి వచ్చింది. 26వ డివిజన్ అయిన ఓల్డ్ మలక్‌పేటలో సిపిఐ గుర్తు కంకికొడవలికి బదులుగా సిపిఎం పార్టీ గుర్తు అయినటువంటి సుత్తికొడవలి గుర్తును బ్యాలెట్ పేపర్‌పై ముద్రించారు. ఇది గమనించిన సీపీఐ హైదరాబాద్ సమితి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడంతో ఆ డివిజన్‌లోని 69 కేంద్రాల్లో పోలింగ్‌ను నిలిపివేశారు. మళ్లీ రేపు బాధవారం ఈ డివిజన్‌లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రీపోలింగ్ అయ్యేవరకు ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పోలింగ్ రద్దుపై స్థానిక ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బీజేపీలోకి హైదరాబాద్ మాజీ మేయర్?











