టాలీవుడ్ లో ఒకప్పుడు కమెడియన్ గా స్టార్ స్టాటస్ ను ఎంజాయ్ చేసిన సునీల్ .. ఆ తర్వాత హీరో గా మారి .. మూడు హిట్స్ సొంతం చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత అతడు హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. కామెడీ హీరోగా కాకుండా.. యాక్షన్ హీరోగా ఎలివేట్ అవ్వాలనుకోవడమే అతడు చేసిన తప్పు. డ్యాన్సులతో , సిక్స్ ప్యాక్ బాడీతో అతడ్ని పదే పదే చూడ్డానికి ప్రేక్షకులకు కూడా విసుగు అనిపించింది. అందుకే సునీల్ హీరోగా క్లిక్ అవలేకపోయాడు. ఆ కారణంగా అతడు .. ప్రధాన పాత్రలు, విలన్ వేషాలు వేయడం మొదలుపెట్టాడు. కానీ అందులో కూడా మనోడికి లక్ కలిసిరాలేదు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ లో ఓ ప్రధాన పాత్ర పోషిస్తోన్న సునీల్ .. మరో సినిమా లో కూడా కీలక పాత్ర చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. త్వరలో ఓ సినిమాతో సునీల్ మళ్ళీ హీరోగా నటించబోతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదండోయ్.. అది తెలుగు సినిమా కూడా కాదు . కన్నడ సినిమా. ఈ సినిమాకి ‘డీటీయస్’ అనే వెరైటీ టైటిల్ ఖాయం చేశారు.
డేర్ టూ స్లీప్ అనేది టైటిల్ పూర్తి అర్ధం. చేతన్ అనే కన్నడ హీరో ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. డోనల్ , నటాషా అనే కొత్త అమ్మాయిలు ఇందులో హీరోయిన్స్. అభిరామ్ పిళ్ళై దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి శ్రీకాంత్ దీపాల నిర్మాత. సాయికార్తిక్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగులోనే హీరోగా నిలదొక్కుకోలేని సునీల్ .. కన్నడ ఇండస్ట్రీలో ఎలా నెట్టుకొస్తాడు అని .. టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కాబోతున్న డీటీయస్ మూవీ సునీల్ కెరీర్ కు ఏ మేరకు హెల్ప్ అవుతుందో చూడాలి.
Must Read ;- ఎన్టీఆర్ మూవీలో ఇద్దరు కామెడీ హీరోలు?











