ఓటీటీ, సోషల్ మీడియాలలో చెలరేగిపోవడానికి ఇక ఛాన్స్ లేదు. వీటి నియంత్రణకు కేంద్ర సిద్ధమైంది. దీనికి సంబంధించి ఐటీ చట్టంలో సవరణలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
ముఖ్యంగా ఓటీటీలో బోల్డ్ కంటెంట్ పేరుతో అశ్లీల చిత్రాల జోరు ఎక్కువైంది. వెబ్ సిరీస్ లలోనూ ఈ బోల్డ్ జోరుకు ఇకపై బ్రేకులు పడనున్నాయి. అంతేకాదు సోషల్ మీడియా గ్రూపులు, కొన్ని రకాల యాప్ లు ఈ చట్టం పరిధిలోకి రాబోతున్నాయి. మీడియా సంస్థలకూ ఈ నియంత్రణలు వర్తిస్తాయి. ఇక నుంచి ఫేక్ న్యూస్ ప్రచారం చేయడానికి వీలుండదు. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేవకర్ లు ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ఇతరులను కించ పరిచేలా రాతలు ఉన్నా, వీడియోలు పోస్టు చేసినా చర్యలు తప్పవు.
ప్రింట్, మీడియాకి సంబంధించి ఇప్పటికే ప్రెస్ కౌన్సిల్ వద్ద కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దీన్ని డిజిటల్ మీడియా కూడా తప్పకుండా అనుసరించాల్సి వస్తుంది. ఇక నుంచి సోషల్ మీడియా పోస్టులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. ఏవైనా అభ్యంతరకర పోస్టులు ఉంటే వాటిని ఎవరు పెట్టారో గుర్తించే ఏర్పాటుచేస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటారు. ఒకవిధంగా మన రాజ్యాంగం మనకు ప్రసాదించిన భావస్వాతంత్ర్యపు హక్కు గురించి చర్చించేలా ఈ నిబంధనలు ఉండబోతున్నాయని అనుకోవచ్చు.
ఇప్పుడు సోషల్ మీడియా, ఓటీటీ సంస్థల విపరీత ధోరణికి ముకుతాడు వేయాలంటే ఇప్పుడున్న చట్టాల వల్ల ఉపయోగం లేదన్న అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. కొత్త చట్టం తయారైతే ఆ పరిధిలోకి సోషల్ మీడియా సంస్ధలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్లు, ఇతర భాగస్వాములను తీసకువస్తారు. ఈ సంస్థల మీద ఫిర్యాదులు వస్తే ఇప్పటిదాకా స్పందించటానికి 72 గంటల సమయం ఉంది. ఈ సమయాన్ని 36 గంటలకు తగ్గిస్తారట. ఆ లోగానే చర్యలు తీసుకోవడం ప్రారంభమవుతుంది. ఇక నుంచి షేర్ చేసే అభ్యంతరకర సందేశాలను సెన్సార్ నిబంధనల పరిధిలోకి తీసుకురానున్నారు.
స్వీయ నియంత్రణ పాటించాల్సిందే
ఓటీటీ, డిజిటల్ సంస్థలన్నీ స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనట. ఇవన్నీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిధిలోకి రాబోతున్నాయి. ముఖ్యంగా డిజిటల్ న్యూస్ పోర్టల్స్ కు ఈ నిబంధనలు వర్తించబోతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఓటీటీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నాయి. ముఖ్యంగా వెబ్ సిరీస్ లలో వచ్చే బూతుకు సెన్సార్ ఉండాలనే విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఓటీటీల్లో బూతును నియంత్రించాలని చాలామంది ఎప్పటినుంచో కోరుతున్నారు. దాంతో ప్రభుత్వం దీని మీద సీరియస్ గా దృష్టిపెట్టింది.
Must Read ;- అశ్లీల యాప్ లో తన ఫోటోలపై స్పందించిన పునర్నవి