గుండె వేగంగా కొట్టుకుంటుందా? .. పల్స్ రేట్ అమాంతంగా పెరిగిపోతుందా? .. ఒళ్లంతా కొలిమిలా కాలిపోతుందా? పాప్ కార్న్ మిషన్లో పేలాల్లా పేలిపోతుందా? అయితే ఇదేదో జబ్బు అనుకుని కంగారుపడవలసిన అవసరం లేదు. ఇవన్నీ కూడా సన్నీ లియోన్ పోస్టర్ ను చూడటం వలన సహజంగా కలిగే లక్షణాలే. ఆమె అందాల ధాటికి తట్టుకోలేక కుప్పకూలి పోయేముందు కనిపించే సూచనలే. వెండితెరపై సన్నీలియోన్ వెన్నెల జలపాతం.
ఆ సౌందర్య తరంగాల్లో తడిసిపోవాలని పడుచు మనసులు కోరుకుంటాయి. ఆమె ఎక్కడ ఉంటే అక్కడికే కొంటె చూపులన్నీ చేరుకుంటాయి.
అలాంటి సన్నీ లియోన్ ఎప్పటిలానే ఓ హాట్ లుక్ ను సోషల్ మీడియాలో వదిలేసి సైలెంట్ గా తనపని తాను చేసుకుపోతోంది. సముద్రంలో మునిగిన జలకన్య స్విమ్మింగుపూల్లో తేలినట్టుగా ఆమె కనిపిస్తోంది. తడిసిన అందాలతో అలసిపోయిన ఆమె, సేదతీరడానికి ఒడ్డుకు చేరుకుంది. తనువంతా నిమ్మరసంతో నింపుకున్నట్టుగా లెమన్ ఎల్లో స్విమ్ సూట్లో ఆమె తళుక్కున మెరుస్తోంది. ఆమె నాజూకు సౌందర్యం నుంచి జారిపోవడానికి ఇష్టపడని నీటి ముత్యాలు ఆమె వంటిని పట్టుకునే వేళ్లాడుతున్నాయి.
సన్నీ లియోన్ స్విమ్మింగుపూల్ ఫొటోలను ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉండటంతో, ఎందుకైనా మంచిదని స్విమ్మింగ్ నేర్చుకుంటున్న కుర్రాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటం విశేషం. ఏదో ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆమె తారసపడకపోతుందా అని వెతుకుతున్నవారి సంఖ్య కూడా ఎక్కువే. అలా అని చెప్పేసి ఈ స్విమ్మింగ్ పూల్ ఎక్కడా అని ఆరా తీస్తున్నారా? ఇది కేరళలోని పూవర్ ఐలాండ్ రిసార్ట్ లోని స్విమ్మింగ్ పూల్. మరి కుర్రాళ్లు అక్కడికి చేరుకునేవరకూ ఆమె అక్కడే ఉంటుందా? మరో స్విమ్మింగ్ పూల్ కి మకాం మార్చేయదూ.
Must Read ;-0 కేరళను అలుముకున్న సన్నీలియోన్ అందాలు