కొన్ని రోజుల సస్పెన్స్‌కు తెరదించుతూ సూపర్‌స్టార్ రజినీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటన చేశారు. ఈ విషయంలో ఎంతగానో ఎదురు చూస్తున్న తన అభిమానులకు రజినీకాంత్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు. రాజకీయ రంగ ప్రవేశం, అలాగే పార్టీ పెట్టబోతున్నట్లు రజినీ ప్రకటించారు. డిసెబంర్ 31న పార్టీ వివరాలు తెలుపుతానని రజనీకాంత్ తెలిపారు. కొత్త ఏడాది జనవరి నుంచి పార్టీని ప్రారంభించనున్నట్లు సూపర్‌స్టార్ ప్రకటించారు. అంతేకాకుండా 2021 ఎన్నికల్లో పోటీ కూడా చేయబోతున్నట్లు రజనీకాంత్ స్పష్టం చేశారు.
30 జిల్లాల తన అభిమాన సంఘాల అధ్యక్షులతో రజినీకాంత్ చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో ఇటీవల రాజకీయ అరంగేట్రంపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా పార్టీ పెట్టబోతున్నట్లు రజినీకాంత్ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇంత తక్కువ టైంలో రజినీ పార్టీ పెట్టి ఏ మేరకు రాజకీయాల్లో రానిస్తారనేది చూడాల్సి ఉంది.
Must Read ;- పొలిటికల్ ఎరీనాలోకి మరొక సినీ హీరో?











