పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీని అఫిషియల్ గా ఎనౌన్స్ చేసి.. మరోసారి వార్తల్లో నిలిచాడు ప్రభాస్. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో రాథేశ్యామ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే… మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో పాన్ వరల్డ్ మూవీని ప్రకటించారు. ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ నటించనున్నట్టు ఇటీవల ఎనౌన్స్ చేసారు. అలాగే కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకునేను ఎంపిక చేసారు.
2021 జనవరిలో ఈ సినిమాని స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అయితే… ఈ సినిమాని ఇంకా స్టార్ట్ చేయలేదు. బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ ఎనౌన్స్ చేసారు. ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహించనున్నారు. రామాయణం ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా నటించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న ఈ సినిమాని 2021లో స్టార్ట్ చేయనున్నారు. 2022లో ఆగష్టులో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాని ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు కేజీఎఫ్ డైరెక్టర్ తో సలార్ మూవీని ప్రకటించి షాక్ ఇచ్చాడు.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. అందరి కంటే… నాగ్ అశ్విన్ ముందుగా ప్రభాస్ తో మూవీ చేయాలనుకున్నాడు. ముందుగా సినిమాని ఎనౌన్స్ చేసాడు కానీ… ఇప్పుడు వీళ్లందరూ వచ్చి నాగ్ అశ్విన్ ని వెనక్కి తోసేసారు అని చెప్పచ్చు. కారణం ఏంటంటే… నాగ్ అశ్విన్ మూవీ సైన్స్ ఫిక్షన్ మూవీ. దీనికి భారీగా గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది. అందుచేత ఈ సినిమాకి ఎక్కువ టైమ్ పడుతుందట. అందుచేత వెనక్కి వెళ్లిందని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం… నాగ్ అశ్విన్ తో చేయనున్న మూవీ 2022లో స్టార్ట్ అయి 2023లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.
సలార్ మూవీ 2021లో స్టార్ట్ అయి 2021లోనే రిలీజ్ చేస్తారని తెలిసింది. బాహుబలితో వచ్చిన ఇమేజ్ ను ప్రభాస్ ఎలా బ్యాలెన్స్ చేస్తాడో అనుకుంటే… మొత్తానికి బాగానే సెట్ చేశాడు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ తీయాలనుకుంటే… అందరి ఆప్షన్ ప్రభాసే అయ్యాడు. హీరో అంటే.. ప్రభాస్… ప్లానింగ్ అంటే ప్రబాస్ అనిస్తున్నాడు. మరి… ఈ పాన్ ఇండియా మూవీస్ తో ప్రభాస్ మరోసారి చరిత్ర సృష్టిస్తాడేమో చూడాలి.
Must Read ;- క్రిష్ మూవీకి ఆ.. టైటిలే ఫిక్స్ చేశారా..?











