తన సినిమాలతోనే కాదు తన మాటలతో కూడా ఎప్పుడూ వార్తలలో ఉండే రాంగోపాల్ వర్మకు వివాదాస్పద దర్శకుడిగా పేరుంది. ఒకప్పటితో పోల్చుకుంటే సినిమాలను తీయడంలో వేగం పెంచిన ఆయన కరోనా సమయంలో మరింత వేగం పెంచి ఈ తొమ్మిది నెలల కాలంలో ఎవరూ తీయనన్ని సినిమాలు తీసేశారు. వాటిలో కొన్ని రొమాంటిక్ కథా చిత్రాలే కాదు కొన్ని యధార్థ సంఘటనల చిత్రాలు కూడా ఉన్నాయి. అవి న్యాయస్థానానికి కూడా ఎక్కాయి. కోవిడ్ సమయంలో తాను తీసిన చిత్రాలను ఏటీటీలో కూడా విడుదల చేసి, మంచి కలెక్షన్స్ రాబట్టి ఆ రకంగా కూడా అందరి దృష్టిని ఆకర్షించారు.
తాను తీసిన మిగతా సినిమాలను వీలువెంబడి వరుసగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కధాంశంతో తీసిన `కరోనా వైరస్’ అనే చిత్రాన్ని ఈ నెల 11న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో తెలియజేస్తూ, ఆ చిత్రం రెండో ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. లాక్ డౌన్ తర్వాత థియేటర్లలో విడుదల అవుతున్న మొదటి సినిమా తమదేనని వర్మ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ సినిమాకు ఆగస్త్య మంజు దర్శకుడు. శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలో నటించారు. .
ఇప్పటికే మొదటి ట్రైలర్ కు ప్రేక్షకుల ఆదరణ విశేషంగా లభించింది. ఇక రెండో ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.“కరోనా ఎవరి నుంచి ఎవరికి.. ఎలా వస్తుందో తెలియటం లేదు… నాకు చెప్పకుండా ఎవరు బయటకు వెళ్లొద్దు”’ అంటూ శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పే డైలాగ్ తో రెండో ట్రైలర్ మొదలవుతుంది. కరోనా మహమ్మారిపై తీసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో విడుదల తర్వాతే తెలుస్తుంది.
Must Read ;- వర్మకు షాకిచ్చిన హైకోర్టు