చిన్న, పెద్దా తేడా లేకుండా.. తనకి నచ్చిన ఎలాంటి సినిమా మీదైనా పాజిటివ్ రివ్యూ ఇవ్వడం దర్శక ధీరుడు రాజమౌళికి పరిపాటి. అలాగే.. ఆయన ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ను ఐయస్ఐ మార్కు లా భావిస్తుంటారు దర్శకులు. ఇప్పటి వరకూ జక్కన్న ను మెప్పించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే.. ఈసారి ఆయన మెచ్చిన సినిమా మలయాళ మూవీ ‘దృశ్యం 2’ కాబట్టి.. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల దృశ్యం 2 సినిమాను తిలకించిన రాజమౌళి.. ఆ మూవీ దర్శకుడు జీతు జోసెఫ్ ను ఓ రేంజ్ లో పొగిడేస్తూ .. రాజమౌళి ఆయనకి ఓ పెద్ద లెటర్ రాశాడు. ‘హాయ్ జీతూ జోసెఫ్ .. నేను ఫిల్మ్ డైరెక్టర్ యస్.యస్.రాజమౌళిని. ఇప్పుడే ‘దృశ్యం 2’ మూవీని చూశాను. ఆ సినిమా నన్ను మళ్లీ మొదటి భాగం చూసేలా చేసింది. స్ర్కీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్, యాక్టింగ్ ఒకటేమిటి.. ఆ సినిమాకి సంబంధించిన ప్రతీ క్రాఫ్ట్ అద్భుతం. ఈ సినిమా ప్రపంచ స్థాయి లో ఉండే ఓ కళాఖండం. ఇక రెండో విషయం ఏంటంటే.. స్టోరీ లైన్. దాన్ని ముందు భాగానికి పెర్ఫెక్ట్ గా మెర్జ్ చేసిన విధానం అయితే అనితర సాధ్యం. మొదటి భాగంలాగానే .. రెండో భాగాన్ని కూడా గ్రిప్పింగ్ గా నడిపించడం .. మీ బ్రిలియన్సీని చాటిచెబుతోంది.. ఇంకా మీనుంచి ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఎన్నో రావాలి ’ అంటూ ఆకాశానికెత్తేశాడు. దీంతో జీతూ జోసెఫ్ ఉబ్బి తబ్బిబ్బయిపోతున్నాడు.
Must Read ;- బాబాయ్ ‘దృశ్యం 2’ లో అబ్బాయ్?