వైసీపీలో చేరనందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని గాజువాక మండలంలో పల్లా కుటుంబీకుల ఆస్తులపై దాడి చేయడంతో పల్లా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులు ఎలాంటి ఆధారాలు చూపకుండానే ఆస్తులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తనకు సంబంధం లేని భూములను చూపించి, తనపై భూ ఆక్రమణల ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ఎక్కడ భూమున్నాయో 2019 ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచానని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు చూపకుండా దాడులు చేస్తే సహించేది లేదన్నారు.
Must Read ;- వైసీపీ ప్రభుత్వానికి కూల్చడం తప్ప కట్టడం తెలియదు : ఎమ్మెల్యే వెలగపూడి










