పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వకీల్ సాబ్ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. తొలి మూడు రోజుల వసూళ్లు కుమ్మేశాయి. ఇక వకీల్ సాబ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అనుకుంటున్న టైమ్ లో.. కరోనా సెకండ్ వేవ్ బాక్సాఫీసుని ముంచేసింది. థియేటర్ల మూతపడడంతో.. వకీల్ సాబ్ జోరు అర్థాంతరంగా ఆగిపోయింది. అయితే.. ఇప్పుడు వకీల్ సాబ్ ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ విషయం ఏంటంటే.. త్వరలోనే థియేటర్లు తెరుచుకుంటాయని ఇండస్ట్రీకి సమాచారం అందిందట. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరుకి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసే సూచనలు కనిపిస్తున్నాయి. జులై ద్వితీయార్థం నుంచి థియేటర్లు ఓపెన్ కావడం ఖాయం అనే టాక్ వినిపిస్తుంది. ఇక థియేటర్లు ఓపెన్ చేస్తే.. విడుదల చేయడానికి సినిమాలు రెడీగా ఉండకపోవచ్చు. అందుకనే వకీల్ సాబ్ మూవీని మళ్లీ విడుదల చేయాలనేది దిల్ రాజు ప్లాన్. వకీల్ సాబ్ ను రీ రిలీజ్ చేయడం ద్వారా మళ్లీ జనాలను థియేటర్లకు రప్పించాలి అనుకుంటున్నారట దిల్ రాజు. కనీసం 300 థియేటర్లలో అయినా, వకీల్ సాబ్ ని విడుదల చేయాలనుకుంటున్నారని తెలిసింది.
50 శాతం ఆక్యుపెన్సీతో పెద్ద సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తారు. చిన్న సినిమాలు వచ్చినా, పెద్దగా ప్రభావం ఉండదు. ఈ గ్యాప్ ని వకీల్ సాబ్ తో ఫిల్ చేయాలన్నది దిల్ రాజు ఆలోచన. వకీల్ సాబ్ ఎడిటింగ్ రూమ్ లో పక్కన పెట్టిసిన కొన్ని సీన్లు కూడా కలిపి ఈసారి కొత్త వెర్షన్ విడుదల చేస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నారని తెలిసింది. పవన్ ని మళ్లీ వెండితెర పై చూడాలి అనుకునేవారికి ఇది మరో ఛాన్స్. మరి.. దిల్ రాజు చేస్తున్న ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
Must Read ;- సంక్రాంతి కానుకగా పవర్ స్టార్ రీమేక్ మూవీ