మసకబారుతున్న ఏపీ సీఐడీ చరిత్ర!?
ఏపీ సీఐడీ చరిత్ర మసకబారుతోంది! చిన్న నేరంపై ఏడు కేసులు నమోదు చేయడం విస్మయానికి గురిచేస్తుందని న్యాయనిపుణులు అంటున్నారు. సీఐడీ కష్టడిలో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబును శుక్రవారం రాత్రి విజయవాడ సీఐడీ కోర్టులో జడ్జి ముందు హాజరు పర్చగా.. తొలుత 14 రోజుల రిమాండ్ విధించిన తరువాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో బెయిల్ మంజురు చేశారు. ఇద్దరి పూచీకత్తు, రూ. 40 వేల డిపాజిట్ తో 2వ ఏసీఎంఎం న్యాయస్థానం ఆయనకు బెయిల్ ఇచ్చింది. బెయిల్ మంజురు అయిన వెంటనే అశోక్ బాబును సీఐడీ విడుదల చేసింది. ఈ సందర్భంగా తన అరెస్ట్ ఉద్దేశించి అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. తనను సీఐడీ సమ్మెపై మాత్రమే విచారించారని, పెట్టిన కేసు గురించి తక్కువగా మాట్లాడారన్నారు. తనపై ఇప్పటికైనా కక్షపూరితమైన చర్యలను ఆపాలని కోరారు. ఉద్యోగులకు నష్టం కలిగిస్తే ఏ ప్రభుత్వమైన కనుమరుగవడం ఖాయమని హెచ్చరించారు.
తప్పడు కేసుకు చెంపపెట్టు..
పదోన్నతి విషయంలో విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను తప్పుగా సమర్చించారని ఆరోపణలతో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ అశోక్బాబు శుక్రవారం రాత్రి బెయిల్ పై విడుదలయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు బెయిల్ రావడం.. కేసు పెట్టిన వారికి చెంపపెట్టులాంటదని చెప్పారు. ప్రభుత్వం కావాలనే తనపై తప్పుడు కేసులు పెట్టినప్పటికీ.. అవి న్యాయస్థానాల్లో నిలబడవన్నారు. సెక్షన్ 41ను పరిగణనలోకి తీసుకోకుండా ఉండేదుకు సంబంధంలేని 468 కింద కేసు పెట్టారని న్యాయం స్థానం గ్రహించిందని అశోక్బాబు తరుఫున న్యాయవాది పేర్కొన్నారు. గతంలో పెట్టిన కేసుకు నాన్ బెయిలెబుల్ సెక్షన్ కలిపారన్నారు. విచారణలో చేపట్టిన న్యాయమూర్తి అశోక్బాబు కు బెయిల్ మంజూరు చేశారని ఆయన వివరించారు.











