విశ్వవిఖ్యాత నటసార్వభౌముని నట వారసుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి.. హీరోగా తనకంటూ ఓ సెపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు తారక్. అభినయంలోనూ, నృత్యంలోనూ అసాధారణమైన టాలెంట్ తో యంగ్ టైగర్ అనిపించుకున్నడు. అయితే అతడు నటించడంలోనూ కాదు.. ఆపదలో ఉన్నవారికి సాయపడడంలో కూడా ఎప్పుడు ముందుంటాడు.
ఇలాంటి సేవా కార్యక్రమాల్లో తారక్ నే కాదు.. అతడి అభిమానులు సైతం కష్టాల్లో ఉన్నవారికి తమ వంతు సాయం అందిస్తారు. ఈ నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ ఉభయ రాష్ట్రాల్ని కుదిపేస్తున్న ఈ తరుణంలో.. తప్పక హెల్ప్ అందిస్తామని చెబుతున్నారు టీమ్ తారక్ ట్రస్ట్ సభ్యులు. హోమ్ క్వారంటైన్ సమయంలో తిరుపతి చుట్టుపక్కల ఎవరైనా ఆహారం దొరక్క ఇబ్బంది పడుతుంటే.. దయచేసి..టీమ్ తారక్ ట్రస్ట్ వారికి ఫోన్ చేయమని ప్రకటన ఇచ్చి.. కింద తమ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. దీని వల్ల కొందరు హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారు వీరి సహాయ సహకారాలు పొందినట్టు తెలుస్తోంది.
Must Read ;- తారక్ , కొరటాల కాంబో మూవీ కథ ఇదేనా?