యన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ ఏ రేంజ్ లో హిట్టైందో తెలిసిందే. మలయాళం కూడా మంచి విజయం నమోదు చేసుకున్న ఈ సినిమా లోని యన్టీఆర్ పాత్ర .. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దాని ఎలివేషన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. దాదాపు ఐదేళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా యన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ అనదగ్గ సినిమా. ఇన్నాళ్ళకు మళ్ళీ ఇదే కాంబోలో మరో సినిమా అనౌన్స్ అయింది.
యన్టీఆర్ 30 గా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమా .. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతోంది. సినిమా అనౌన్స్ మెంట్ రోజున .. కొరటాల తన ట్విట్టర్ హ్యాండిల్ లో లాస్ట్ టైమ్ మేము.. లోకల్ లోనే రిపేర్స్ చేశాం. ఈ సారి బౌండరీస్ దాటబోతున్నాం అని ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో లార్జర్ స్కేల్ లోనే తెరకెక్కబోతోంది అనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు. ఇక ఈ సినిమా కథ ఇది అంటూ .. సినిమా అనౌన్స్ అయిన నాటి నుంచి సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది.
ఓ చిన్న గ్రామం నుంచి నగరానికి ఉద్యోగం నిమిత్తం వలస వచ్చిన హీరో .. ఆ తర్వాత జరిగే అనూహ్య పరిణామాల వల్ల .. ఓ ఏరియా ప్రజల కు దేవుడైపోతాడట. నిజానికి రాజశేఖర్ అన్న, ప్రభాస్ ‘యోగి’ సినిమాలన్నీ అదే లైన్ లో రూపొందాయి. అయితే కొరటాల ఇచ్చే ట్రీట్ మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే తారక్.. ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాల సినిమా లో నటించాలని భావించాడట. మరి ఈ సినిమా స్టోరీ లైన్ అదో కాదో తెలియాలంటే.. వచ్చే ఏడాది ఏఫ్రిల్ 29 వరకూ ఆగాల్సిందే.
Must Read ;- మహానట వారసత్వంలో మణిపూస ఎన్టీఆర్ @25