కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రేపటి నుంచి రాత్రి పది నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఏపీలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి వారికి కరోనా టీకా ఉచితంగా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇప్పటికే 45 సంవత్సరాలు దాటిన వారికి ఉచితంగా కరోనా టీకా వేస్తున్నారు. ఇక నుంచి 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికీ కరోనా టీకా ఉచితంగా అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య 2,04.70,364 మంది జనాభా ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీరందరికీ రోజుకు 6 లక్షల మంది చొప్పున ఉచితంగా టీకా వేయాలని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు.
రేపటి నుంచి కర్ఫ్యూ అమలు
కరోనా కట్టడికి రేపటి నుంచి ప్రభుత్వం కర్ఫ్యూ అమల్లోకి తీసుకువచ్చింది. రాత్రి పది గంటల నుంచి 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు కొరత లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రోజుకు పదివేల మందికిపైగా కరోనా భారిన పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించడంతో బెడ్లు దొరక్క అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
Must Read ;- ఇప్పటికే అతలాకుతలం.. కరోనా త్రిపుల్ మ్యుటేషన్ మరింత డేంజర్