తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇదివరకు మాస్కులు పెట్టుకున్న, పెట్టుకోకున్న చూసీ చూడనట్లు వ్యవహరించింది. ఇక నుంచి మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రతిఒక్కరు మాస్కు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఒక వేళ మాస్కు పెట్టుకోకపోతే, రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఒక జీవో విడుదల చేశారు. అయితే జరిమానాతో పాటు అరెస్టులు కూడా చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ సీఎస్ జీవో విడుదల చేయడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కఠిన చర్యలు తీసుకోనున్నారు.
Must Read ;- మాస్క్ మస్ట్, లేదంటే కఠిన చర్యలు : సీపీ అంజనీ కుమార్