తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలకు ఘోర అవమానం జరిగింది. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ గూడూరు నియోజకవర్గం తూపిలిపాళెంలో మత్య్సకారులతో వైసీపీ నేతలు ఆత్మయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ను మత్స్యకారులు నిలదీశారు. ఎన్నికలప్పుడే తాము గుర్తుకు వస్తామా అంటూ సభలో గందరగోళం సృష్టించారు. తమిళనాడు నుంచి వస్తున్న మత్య్సకారుల బోట్ల సమస్యలను గూడూరు ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు చెప్పినా పరిష్కరించలేదని మత్య్సకారుల ఆందోళనకు దిగారు. ఈ సమావేశంలో పాల్గొన్న మత్య్సకార మంత్రి అప్పలరాజు, వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు సర్థిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా మత్స్యకారులు వినకపోవడంతో సభను అర్థంతరంగా ముగించి వైసీపీ నేతలు వెనుతిరిగి వెళ్లిపోయారు.
మత్య్సకారుల్లో తీవ్ర వ్యతిరేకత
నెల్లూరు జిల్లాల్లోని తీర ప్రాంత మత్స్యకారుల్లో వైసీపీ నేతలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తమిళనాడుకు చెందిన మత్స్యకారులు ఏపీ సముద్ర జలాల్లోకి వచ్చి చేపల వేట సాగిస్తూ అడిగిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. మత్స్యకారులు వైసీపీ ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో వారంతా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Must Read ;- నెల్లూరు వైసీపీలో విభేదాలు.. మంత్రి అనిల్ అసహనం