తిరుపతిలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఎస్వీ యూనివర్సిటీలో నాటు బాంబులు పేలడంతో కలకలం చెలరేగింది. యూనివర్సిటీలోని ఐ బ్లాక్ సమీపంలో ఈరోజు ఉదయం రెండు నాటు బాంబులు పేలడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఓ కుక్క, పంది మృతి చెందాయి. పోలీసులు హుటాహుటిన యూనివర్సిటీకి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. బాంబు స్క్వాడ్ అక్కడకు చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పెరుమాళ్ళ పల్లెకు చెందిన ఇద్దరు అనుమానితులను యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అడవి పందులను పట్టుకోవడానికి వేటగాళ్ళు పెట్టిన నాటు బాంబులని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.
Also Read:తిరుపతిలో రత్నప్రభ నామినేషన్.. జనసేన నేతలు దూరం










