మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ .. సరికొత్త చిత్రం ‘జోజి’. ఫహద్‌తో ‘మహేషిండే ప్రతికారం, తొండి ముదలుమ్ దృక్సాక్షియుమ్’ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన నటుడు, ప్రముఖ దర్శకుడు దిలీష్ పోత్తన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. షేక్స్పియర్ రాసిన ‘మెక్బత్’ నాటకంలోని ఒక ఘట్టం నుంచి ప్రేరణ పొంది ఈ సినిమా కథను రాసుకున్నాడు దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్ 7న డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ‘జోజి’ సినిమా టీజర్ ను విడుదల చేశారు.
జోజి పాత్రధారి ఫహద్ ఫాజిల్ ఒక మడుగులో గేలం వేసి దాని కొక్కానికి ఏదో బరువైనది తగలడంతో .. షాకవుతాడు. ఈ సన్నివేశాన్ని టీజర్ గా విడుదల చేశారు. కేరళలోని మనోహరమైన ప్రదేశాల్లో ఈ సినిమాను చిత్రీకరించారు. ఉన్నిమాయ ప్రసాద్, షమ్మీ తిలకన్, బాబు రాజ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వారితో పాటు సినిమాలో కొందరు కొత్త నటీనటులు కూడా కనిపిస్తారు. వర్కింగ్ క్లాస్ హీరో, భావన స్టూడియోస్, ఫహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ సంయుక్త బ్యానర్స్ లో సినిమాను నిర్మించారు. మరి జోజిగా ఫహద్ ఏ రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తాడో చూడాలి.
Also Read:టీజర్ టాక్ : అద్భుతమైన విజువల్స్ తో ‘ఆకాశవాణి’