నందమూరి నటసింహం బాలయ్య – ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రలను పోషిస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ చిత్రాలు రూపొందడం.. ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమా పై అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మూవీ సెట్ లో బాలయ్యను తెలంగాణ తెలుగు యువత ప్రతినిధలు కలిశారు. ఇంతకీ కారణం ఏంటంటే… ఈనెల 24న తెలంగాణ తెలుగు యువత కార్యక్రమం జరగనుంది. ఇందులో జరగనున్న తెలంగాణ తెలుగు యువత కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా వారు బాలయ్యను ఆహ్వానించారు. ఈ మేరకు తెలంగాణ తెలుగు యువతకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పొగాకు రామ్ చందర్ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా బాలయ్య చేతుల మీదుగా తెలంగాణ తెలుగు యువత లోగోను ఆవిష్కరించారు.
Must Read ;- బాలయ్య, బోయపాటి మూవీలో బాలీవుడ్ విలన్?
Telangana Telugu Yuvatha met Natasimha #NandamuriBalakrishna on the sets of #BalayyaBoyapati3#NBK #BoyapatiSrinu #BB3 pic.twitter.com/5Fkfeub8vN
— BARaju (@baraju_SuperHit) December 22, 2020