నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. ఈ సినిమా తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్, డిక్టేటర్ డైరెక్టర్ శ్రీవాస్ బాలయ్యతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో బాలయ్యతో పూరి జగన్నాథ్ ‘పైసా వసూల్’ సినిమా చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్త ఏంటంటే.. లాక్ డౌన్ టైమ్ లో పూరి బాలయ్య కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశారట. ప్రస్తుతం పూరి ముంబాయిలో ఉన్నారు. హైదరాబాద్ వచ్చిన వెంటనే బాలయ్యకు కథ చెప్పానున్నారని తెలిసింది. ‘పైసా వసూల్’ నిర్మించిన భవ్య క్రియేషన్స్ సంస్థే ఈ సినిమాని కూడా నిర్మించనుందట. ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించడానికి రెడీగా ఉన్నారట. పూరి బాలయ్యకు కథ చెప్పడమే తరువాయి.. మిగతా అంతా రెడీ అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ మూవీ గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని సమాచారం.
Must Read ;- రామ్ డైరెక్టర్ తో బాలయ్య టైటిల్ అదిరింది..!