(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో దేవాలయాలు, దేవతా మూర్తులపై దాడులు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా హిర మండలం పాతకొమనాపల్లి గ్రామానికి చెందిన కాశీవిశ్వేశ్వర దేవాలయం గోపురం(శిఖరం)ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.ఈ ఘటనతో ప్రజలు, పోలీసులు ఉలిక్కి పడ్డారు. దుండగులు ఆలయ శిఖరంలోని పూరపు కుండలో ఉన్న చిల్లర నాణేలు మాత్రమే తీసుకెళ్లారు.
ఎస్‌ఐ కథనం ప్రకారం ..
హిర మండలం ఎస్‌ఐ కె.గోవిందరావు అందించిన వివరాల ప్రకారం .. పాత కొమనాపల్లి గ్రామానికి రెండు కిలోమీటర్లు దూరంలో దేవాలయం ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారని, పురాతన నాణేలు తీసుకెళ్లారని, సంఘటనా స్థలంలో 1943కు చెందిన నాలుగు నాణేలు పడి ఉండటాన్ని గుర్తించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పురాతన నాణేల కోసం దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని పాతపట్నం సీఐ రవి ప్రసాద్ తెలిపారు.
Must Read ;- విగ్రహాల ధ్వంసాన్ని నిరసిస్తూ ధర్మ పరిరక్షణ దీక్షలు











