మోదీ మాస్క్ లు రైతు ఉద్యమానికి ఊతం ఇస్తుందని భావిచాం..!
ఏపీ రాజధాని అమరావతే అని నినదిస్తూ రైతులు దీక్ష ప్రారంభించిన తొలినాళ్లలో తమ దగ్గర ఎక్కువగా ఉన్నవి మోడీ మాస్కులూ, ప్లకార్డులేనని గద్దె బుచ్చి తిరుపతిరావు చెప్పారు. అవన్నీ క్రమంగా కనుమరుగవటానికి కారణం రాష్ట్ర నాయకుల అసమర్ధతేనని వాపోయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఆడిన మైండ్ గేమ్ ని బీజేపీ ఖండించలేక పోవడం, ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయానికీ కేంద్రం ఆమోద ముద్ర ఉంటుందని ప్రకటించినప్పుడైనా స్పందించకపోవడం వంటివి చూసే.. అమరావతి ప్రజల్లో బీజేపీ పై నేటికి అనుమానాలున్నాయని వివరించారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదని, రాజధానికి భూమిని ఇచ్చిన రైతునని చెప్పుకొచ్చారు. రాజధాని ప్రాంత రైతులకూ, మహిళలకూ, రాజకీయాలతో అవసరం లేదని, ఉద్యమం మొదలైనప్పుడు వాస్తవంగా అమరావతి ప్రజలందరూ మోడీ వైపు ఆశావహంగా చూశారన్నది వాస్తవం అని వాపోయ్యారు! మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని, ఆయనే కాపాడతారని భావించాం! శంఖుస్థాపన దినానికి ఐదవ వార్షికోత్సవానికి కూడా మోడీ గారి మాస్కులనే ధరించామని గుర్తు చేశారు. కొంతమంది రాష్ట్ర నాయకులు ఇప్పటికీ రాజధాని విషయంలో భిన్నమైన వ్యాఖ్యలు చేయడం పట్ల అమరావతి ప్రజలకు బీజేపి పై విపరీతమైన అనుమానాలు కలుగజేస్తున్నాయని చెప్పుకొచ్చారు.
రైతు ఉద్యమాన్ని రాజకీయ సాధనంగా ఉపమోగించుకోవద్దు..!
రాష్ట్రంలోని ప్రజలందరి భవిష్యత్తు కోసం చేస్తున్న రాజధాని అమరావతి ఉద్యమానికి అందరి మద్దతును ఆశిస్తున్నామని తిరుపతిరావు స్పష్టం చేశారు. అదే సమయంలో రైతులను ఒక రాజకీయ సాధనంగా ఉపయోగించుకుందామని, నిస్సహయతను అడ్డుపెట్టుకొని స్వప్రయోజనాలు పొందుదామని ఆలోచించే వారికి, ప్రభుత్వాన్ని నమ్మి చేసిన త్యాగాలను గుర్తించని వారికి తిరిగి సమాధానం చెప్పగల సత్తా అమరావతి రైతులకు ఉందన్నారు. రాజధాని అమరావతి అనేది రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష కూడా అని గుర్తు చేశారు. రెండు సంవత్సరాలుగా తాము ఎన్నో ఎదుర్కొన్నామని, ఇంకా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తన అంతరంగాన్ని బయటపెట్టారు.
Must Read ;- సీఎం జగన్ రెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం..!