శృతిహాసన్.. ఒకప్పుడు తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తూ.. బిజీగా ఉండేది. కెరీర్ ఊపులో ఉన్నప్పుడు లవ్ అంటూ నటనకు బ్రేక్ ఇచ్చింది. ఆతర్వాత లవ్ కి బ్రేక్ పడడంతో ఇప్పుడు సినిమాల పై దృష్టి పెడుతుంది. ఇటీవల మాస్ మహారాజా రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటించింది. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. దీంతో శృతి హాసన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.

ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సలార్ మూవీలో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. పిట్ట కథలు అనే వెబ్ మూవీలో నటించింది. నాలుగు విభిన్నమైన కథల సమాహారంగా రూపొందిన ఆంథాలజీ వెబ్ మూవీ ఇది. ఫిబ్రవరి 19 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల రిలీజైన ఈ పిట్టకథల ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, సంకల్పరెడ్డి, నందినీ రెడ్డి.. ఈ నలుగురు దర్శకులు దర్శకత్వం వహించారు. ఇందులో ఒక బోల్డ్ స్టోరీలో బోల్డ్ క్యారెక్టర్ లో శ్రుతి హాసన్ నటించింది.
బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి కారణం ఏంటి.? అని శృతి హాసన్ ని అడిగితే.. షాకింగ్ ఆనర్స్ ఇచ్చింది. ఇంతకీ ఏం చెప్పిందంటే.. ఒక మహిళగా తాను దీనికి బాగా కనెక్ట్ అయ్యాను. ఇంకా చెప్పాలంటే.. నేను స్త్రీ కావడం.. విముక్తి అన్న ఎలిమెంట్ ఆకర్షించాయని.. అందుకే పిట్ట కథల్లో బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి ఓకే చెప్పానని అసలు విషయం బయటపెట్టింది. పిట్ట కథలు ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. మరి.. ఫిబ్రవరి 19న రిలీజ్ కానున్న పిట్ట కథలు ఎంత వరకు ఆకట్టుకుంటాయో చూడాలి.
Also Read: శృతిహాసన్ తో రొమాన్స్ చేయనున్న‘వకీల్ సాబ్’











