నందమూరి బాలకృష్ణ అఘోరాగా నటిస్తున్న ‘అఖండ’ టైటిల్ సాంగ్ అదరగొట్టేస్తోంది. రెండ్రోజుల క్రితం ఈ పాట ప్రోమో విడుదల చేయగా మూడు మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఒక పాట విడుదలైంది. ఇంతకు ముందు విడుదలైన ‘అడిగా అడిగా పంచప్రాణాలు’ నీ రాణిగా సాంగ్ నాలుగు మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టింది. కళ్యాణ్ చక్రవర్తి రాసిన ఆ పాటను ఎస్. పి. చరణ్, ఎం.ఎల్. శ్రుతి పాడారు.
బాలయ్య, బోయపాటి అంటేనే హిట్ కాంబినేషన్ వీరిద్దరి కలయికలో 2010లో వచ్చిన సింహా, 2014లో వచ్చిన లెజండ్ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. మళ్లీ వాళ్లిద్దరి కాంబినేషన్ లో అఖండ రూపొందుతుందనగానే అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. పూర్తిగా మాస్ మసాలా ఫార్ములాతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈరోజు టైటిల్ సాంగ్ విడుదలైంది. కాకపోతే అనుకున్నసమయం కన్నా కొద్దిగా ఆలస్యంగా విడుదలైంది. 12.03 గంటలకు ఈ టైటిల్ సాంగ్ విడుదలైంది. ‘భం అఖండ.. భం భం అఖండ’ అనే పల్లవితో సాగే ఈ పాట ఈరోజు ఉదయం 11. 39 నిమిషాలకు విడుదలవుతుందని ముందుగా ప్రకటించారు. కానీ కొద్దిగా ఆలస్యమైంది.
అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను శంకర్ మహదేవన్, సిద్ధార్థ మహదేవన్, శివమ్ మహదేవన్ పాడారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావలసి ఉన్నా వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబరు 24న విడుదల కానున్నట్లు సమాచారం. అలాంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడు పోయాయని తెలుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దీన్ని కొనుగోలు చేసింది. థియేటర్ లో సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ జరుగుతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా హిట్ అయితే అది హ్యాట్రిక్ అవుతుంది.
Must Read ;- బాలయ్యతో శ్రుతి.. ఆ సెంటిమెంట్ తో బ్లాక్ బస్టరా?











