గతంలో ఏ హీరోయిన్ అయినా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళితే గొప్ప. అయితే ఇప్పుడీ ఈ వ్యవహారం రివర్స్ అయింది. బాలీవుడ్ భామలు సౌత్ సినిమాల్లో వచ్చిన అవకాశాల్ని వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ అనేసరికి వారంతా కాస్తంత ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు ఊపందుకున్న నేపథ్యంలో అది మరీ ఎక్కువగా ఉంది. అలాంటి వారి జాబితాలో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు సయీ మంజ్రేకర్.

తెలుగులో అడివి శేష్ నటిస్తోన్న ‘మేజర్’ అనే బయోపిక్ లో సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో సయీ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ పాత్ర ఆమెకి నటన పరంగా మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆమె భావిస్తోంది.

ఇక సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోన్న మరో తెలుగు సినిమా గని. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ హీరోగా నటిస్తున్న ఈ స్పోర్ట్ డ్రామాలో కూడా అమ్మడిది గ్లామర్ కు, పెర్ఫార్మెన్స్ కు సమాన ప్రధాన్యం కలిగిన పాత్ర అని టాక్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గని సినిమా కూడా సయీ మంజ్రేకర్ కు మంచి పేరు తెస్తుందని అంటున్నారు. మొత్తం మీద ఈ రెండు సినిమాలూ ఈ ఏడాదే విడుదల కానుండడంతో .. ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ లో స్థిరపడడం ఖాయం అంటున్నారు. చూద్దాం అమ్మడి దూకుడు ఏ స్థాయిలో ఉంటుందో.
Must Read ;- తుఫాన్ కల్లోలంలోనూ.. టీవీ బ్యూటీ హాట్ విన్యాసాలు












