‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెందరూ’ అన్న పాట మాదిరి లాంటిదే యాంకర్ అనసూయ జీవితం. యాంకర్ గానూ, నటిగానూ ఆమె జీవితం ‘జబర్దస్త్’గా సాగిపోతోంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనసూయ ఈమధ్య గర్భం దాల్చిన ఫొటో ఒకటి పోస్టు చేయగానే విపరీతమైన స్పందన. అనసూయ మళ్లీ తల్లి కాబోతోందంటూ విపరీతమై ప్రచారం. ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు. మళ్లీ తల్లి కావడం ఎందుకు అంటూ కొందరైతే పెదవి విరిచారు. అసలు విషయం ఏమిటంటే ఇటీవలే ఆమె హీరోయిన్ గా నటించిన ‘థాంక్యూ బ్రదర్’ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె గర్భిణి పాత్రను పోషించింది. అందులోని ఓ పిక్ తీసుకుని ఇలా పోస్టు చేసిందో లేదో అలా కామెంట్లు వచ్చేశాయి మరి.

ఈ వయసులో నీకు పిల్లలు అవసరమా అని ఒకరు, కరోనా పోయాక ప్లాన్ చేసుకుంటే పోలా అని ఇంకొకరు, ఈ పోస్టులు బదులు ఆపదలో ఉన్న జనాన్ని ఆదుకోవచ్చు కదా అంటూ ఇంకొకరూ.. ఇలా కామెంట్లు చేసుకుంటూ పోయారు. కరోనా సెకండ్ వేవ్ లో అనసూయ సోషల్ మీడియా పోస్టుల్లో యమ బిజీగా ఉంది. తన ఫాలోవర్స్ తో ఫేస్ బుక్ లో ముచ్చట్లు పెట్టుకుంటోంది. తాను ఒకటి మిస్సవుతున్నానంటూ ఈ మిస్సు తెగ ఏడ్చేసింది. ఇంతకీ ఆమె మిస్సవుతోంది ఏమిటో తెలుసా?.. షాపింగ్ చేయడం అట.
Must Read ;- వర్షంలో కాగితం పడవలు వదిలిన అనసూయ

ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ ఇలా ఏడ్చేసింది. ఈ వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. ఆన్ లైన్ షాపింగ్ ఇష్టమా.. పర్సనల్ షాపింగ్ ఇష్టమా? అంటూ అతను ప్రశ్న అడిగిందే తడువు సమాధానం చెప్పేసింది. తాను స్వయంగా వెళ్లి షాపింగ్ చేసుకుంటేనే సంతృప్తికరంగా ఉంటుందట. అది చాలా మిస్సవుతున్నాననంటూ ఏడుస్తూ చెప్పేసరికి అతను అవాక్కయ్యాడు. మొత్తానికి ఈ కరోనా కాలం ఇలా ముచ్చట్లు పెట్టుకోడానికి మాత్రం బాగా ఉపయోగపడుతోంది.
అనసూయ జీవితం టర్న్ ఇలా..
ఆమె పుట్టిపెరిగిందంతా హైదరాబాదే. భద్రుక కళాశాలలో చదువు. ఎంబీఏ పూర్తిచేశారు. పిక్సలాయిడ్ అనే సంస్థ లో హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ గా జీవితం ప్రారంభమైంది. అది మల్టీమీడియా సంస్థ. అందంగా ఉండటంతో సినిమా అవకాశాలు తలుపుతట్టినా స్పందించలేదు. చివరికి సాక్షి టీవీలో వ్యాఖ్యాతగా చేసిన రంగ ప్రవేశం రంగమ్మత్త దాకా కొనసాగింది. ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది మాత్రం జబర్దస్త్ షో. నిజానికి ఆమె 2003లోనే తెరపై కనిపించింది. ఎన్టీఆర్ ‘నాగ’ సినిమాలో లా స్టూడెంట్ గా కనిపించింది. ఆ తర్వాత 13 ఏళ్లకు ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంతో అందరి దృష్టినీ ఆకర్షించింది ఆమె.
రంగస్థలంలో రంగమ్మత్త పాత్రతో సినిమా రంగంలో ఆమెకంటూ ఓ ప్రత్యేక స్థానం దక్కింది. పాత్ర ఎలాంటిదైనా తనదైన ప్రత్యేకను చూపడం అనసూయ ప్రత్యేకత. అలా ఎన్నో టీవీ షోలలోనూ రాణించింది. అందుకే అనసూయను చూసి అసూయ చెందేవారూ ఉంటారు. ఒక్కో సినిమాతో తన ఇమేజ్ ను పెంచుకుంటూ ఆమె ముందుకు వెళుతోంది. సపోర్టింగ్ పాత్రల నుంచి మెయిన్ లీడ్ స్థాయికి ఎదిగింది. మొత్తానికి నటిగా అనసూయ కెరీర్ నల్లేరు మీద బండి నడకలా సాగుతోంది. సుశాంక్ భరద్వాజ్ ని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో హ్యాపీ జీవితాన్ని అనుభవిస్తోంది అనసూయ.
Also Read ;- వయ్యారాల అనసూయను చూస్తే వామ్మో అనాల్సిందే











