అక్కినేని ఫ్యామిలీ హీరోల కెరీర్ లోనే కాకుండా.. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని సినిమాగా నిలిచింది ‘మనం’. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా క్లాసిక్ గా నిలిచింది. డా. అక్కినేని, నాగార్జున, నాగ చైతన్య, సమంత కలిసి నటించారు. అమల – అఖిల్ స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చారు. ఇప్పటి వరకు రాని కథాంశంతో ‘మనం’ చిత్రాన్ని డైరెక్టర్ విక్రమ్ కుమార్ తెరకెక్కించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
‘మనం’ సినిమా స్పూర్తితో.. మంచు ఫ్యామిలీ మల్టీస్టారర్ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వచ్చింది. మేనమామ, మేనల్లుడు అయిన దగ్గుబాటి హీరో వెంకీ – అక్కినేని హీరో చైతన్య కాంబినేషన్ లో వెంకీ మామ వచ్చింది. చిరు – చరణ్ కాంబినేషన్ లో ‘ఆచార్య’ వస్తోంది. బాబాయ్ – అబ్బాయ్ వెంకీ – రానా కాంబినేషన్ లో మూవీ ప్లానింగ్ లో ఉంది. అలాగే పవన్ – చరణ్ కాంబినేషన్ లో మూవీ కోసం కూడా ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి.
ఇలా ఫ్యామిలీ హీరోల మల్టీస్టారర్ ల ట్రెండ్ ‘మనం’ సినిమాతోనే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు నాగార్జున, అమల, చైతన్య, సమంత, అఖిల్, సుమంత్, సుశాంత్, సుప్రియ.. ఇలా అక్కినేని ఫ్యామిలీ నటీనటుల భాగస్వామ్యంలో ఓ భారీ మల్టీస్టారర్ కి ప్లాన్ జరుగుతుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అది కూడా విక్రమ్ కుమార్ డైరెక్షన్ లోనే అని అంటున్నారు. దీనికి కథ రెడీగా ఉందట. ఇంతకీ ఎవరు రెడీ చేశారంటే.. డైరెక్టర్ దశరథ్ అని తెలిసింది. ఇది ముగ్గురు అన్నదమ్ముల కథ అని.. ఇందులో సుశాంత్ – సుమంత్ – సుప్రియ కూడా నటిస్తారని అంటున్నారు. మరి.. ప్రచారంలో ఉన్న వార్త వాస్తవమేనా.? కాదా.? అనేది తెలియాల్సివుంది.
Must Read ;- అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ మల్టీస్టారర్ మూవీ?











