అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో అఖిల్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు – వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే.. అక్కినేని నాగచైతన్య.. తమ్ముడు అఖిల్ తో నటించిన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డేతో కలిసి నటించనున్నాడని సమాచారం. ఇంతకీ ఏ సినిమాలో అంటే.. థ్యాంక్యూ మూవీలో అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి మనం, 24, హలో, గ్యాంగ్ లీడర్.. ఇలా విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ చైతన్య హాకీ ప్లేయర్ పాత్రను పోషిస్తున్నారు.
పూజా హేగ్డే నాగచైతన్యతో గతంలో ‘ఒక లైలా కోసం’ చిత్రంలో నటించింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున నిర్మించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ 2014లో రిలీజైంది. మంచి విజయాన్ని సాధించింది. మళ్లీ ఇప్పుడు చైతన్య – పూజా హేగ్డే కలిసి నటించనున్నారని తెలిసింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న థ్యాంక్యూ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read : రేసుగుర్రమెక్కిన అక్కినేని అఖిల్ కెరీర్











