యంగ్ హీరో నితిన్ .. లాస్టియర్ ‘భీష్మ’తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. అయితే ఈ ఏడాది మాత్రం వరుస సినిమాలు లైన్ లో పెట్టుకున్నాడు. ఆల్రెడీ కిందటి నెలలో ‘చెక్’ మూవీ రిలీజ్ అయిపోయింది. సినిమా పర్వాలేదనిపించుకుంది. ఇక ఈ నెలలో ‘రంగ్ దే’ విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చ్ 26న విడుదల కానున్న ఈ సినిమాపై నితిన్ మంచి హోప్స్ తో ఉన్నాడు. అలాగే.. దీని తర్వాత సినిమాని కూడా నితిన్ ఈ ఏడాదే విడుదల చేసే ఉద్దేశంతో ఉన్నాడని తెలుస్తోంది.
బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన ‘అంధాధున్’ మూవీ నితిన్ హీరోగా తెలుగులో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నభానటేశ్ కథానాయికగా నటిస్తుండగా.. ఒరిజినల్ వెర్షన్ లో టబు పోషించిన బోల్డ్ పాత్రను .. తమన్నా చేస్తోంది. దీనికోసం తమ్మూ.. ఏకంగా.. రూ. 1.5కోట్లు పారితోషికం అందుకున్నట్టు సమాచారం. తెలుగులో ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ మూవీని నిజానికి జూన్ 11న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్ . అయితే ఎందుకో గానీ.. ఈ మూవీని ఒక వారం ముందుగానే .. అంటే జూన్ 4 న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. ఇక ఈ సినిమాలో నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు.











