యంగ్ టైగర్, స్టైలిష్ స్టార్ ఇద్దరూ హీరోలుగా మరో క్రేజీ మల్టీస్టారర్ భవిష్యత్తు లో వస్తుందేమో తెలియదు కానీ.. ఇక్కడున్న ఇద్దరు లిటిల్ సూపర్ స్టార్స్ ను చూస్తుంటే.. ‘ట్రిపుల్ ఆర్’ లా.. ‘డబుల్ ఏ’ అని ఎవరైనా దర్శకుడు సినిమా తీస్తే బాగుండనని అనిపిస్తోంది కదూ. అలా అనిపించడం లో తప్పులేదు కూడా. ఎందుకంటే.. ఆ ఇద్దరూ యన్టీఆర్, అల్లు అర్జున్ సుపుత్రులు మరి. ఆ ఇద్దరూ అంటే.. వారి తండ్రులకు చెప్పలేని గారం. ఇద్దరూ చక్కగా మాస్క్ పెట్టుకొని పైగా.. ఒకే డ్రెస్ లో రివీలవడం అందరినీ ఆకట్టుకుంటోంది.
నిహారిక పెళ్ళి సందర్భంగా.. సందడి చేసిన ఈ ఇద్దరు చిచ్చర పిడుగులూ.. చూపరుల్ని భలేగా ఆకర్షిస్తున్నారు. యన్టీఆర్ తనయుడు అభయ్ రామ్, అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ కాబోయే టాలీవుడ్ సూపర్ స్టార్స్ అని అభిమానులు ఇప్పటి నుంచే మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఇద్దరూ నిజంగానే భవిష్యత్తులో పెద్ద హీరోలై.. అభిమానుల కోరిక తీరుస్తారని ఆశిద్దాం..
Must Read ;- నిహారిక సంగీత్ లో నల్లకలువలా మెరిసిన రీతూ వర్మ