ఏమైందో ఏమో కానీ, అమెరికా నుండి లైవ్ పెట్టి మరీ పావుగంట పైన రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని ఏకబిగీన ఏకిపారేశారు కె ఏ పాల్. కొన్ని వినడానికి కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ‘మీకిప్పడు చాలా బ్యాడ్ న్యూస్ చెప్తున్నాను. 2007 జూన్ 8న నాకు, వైయస్సార్‌కి మధ్య జరిగిన గొడవని టివి9 వారు 8 గంటలపాటు కవర్ చేశారు. కేవలం రాజశేఖర్ రెడ్డి అడిగిన లంచం నేనివ్వలేదని ఆయన శాంతి చర్చలని క్యాన్సిల్ చేశారు. ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మార్పు చెందమని ఎన్ని అవకాశాలు ఇచ్చిన మార్పుచెందకపోగా.. చనిపోయిన రోజు కూడా నాతో యుద్ధం చేశాడు. నా అస్తులను మా అన్నయ్య, మిగిలిన అందరికీ ఇవ్వడానికి అన్నీ ఏర్పాట్లు చేశారు.’
నా శాపమే తగిలింది..
‘ఆ రోజున శపించాను. ముక్కలు ముక్కలు అవుతావని, కనీసం ముక్కలు కూడా దొరకవని శపించాను. అలాగే అయింది. 8:30 నిమిషాలకు శపించాను.. 9:30 కి అలా అయింది. దేవుని దాసుడుని, దేవుని సువార్తని ఎవరూ ఆపకూడదు. న్యూయార్క్‌లో కొవిడ్ ఉన్నందు వల్ల, విశాఖపట్నం నుండి 200 దేశాలకు 24వ తేదీ రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు నేను చెప్పే సువార్తను 2700 బిలియనీర్లు చూస్తారు కాబట్టి మీడియా మిత్రులంతా లైవ్ ఇవ్వబోతున్నారు. కానీ కరోనా ప్రొటోకాల్ సాకు పెట్టి కేవలం 230 మందినే 23 జిల్లాల నుండి నేను తీసుకొస్తే, ఇప్పుడు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి గారు మన గ్లోబల్ క్రిస్మస్ వేడుకల్ని క్యాన్సెల్ చేశారు.
రెడ్డి గారు మీకు ఎటువంటి సహాయమైన చేస్తాను.. ప్రోమోట్ చేస్తాను.. ఇలా 2 సంవత్సరాల నుంచి ఆహ్వానం పంపూతూనే ఉన్నాను. కానీ ఆయన కళ్లు నెత్తి మీద ఉన్నాయి. ఒకపక్క ప్రతి పక్షాలు సిఎంని తిడుతుంటే.. తిట్టకండి, ఆయన నాకంటే 10 సంవత్సరాలు చిన్నవాడైనా కానీ ఆయన రాష్ట్రానికి సిఎం అని చెప్పాను. కరోనా టైం నా బిల్డింగ్స్ వాడుకోండని చెప్పాను. అంతేకాదు 7000 కోట్టు డొనేషన్ ఇస్తానని చెప్పాను లెటర్ ఇవ్వండి అంటే కనీసం స్పందించలేదు. మా సువార్త సెలబ్రేషన్‌ని క్యాన్సెల్ చేసి మా బ్యానర్‌ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో పెట్టారు.
జగన్మోహన్ రెడ్డి గారు, ఒక వార్నంగ్.. మీ నాన్నని దుష్టుడా, దుర్మార్గుడా, నీచుడా, అసహ్యుడా అన్నాను. మీకు ఫస్ట్ వార్నింగ్ డోస్ ఇస్తున్నా.. నాతో పెట్టుకున్న డోనాల్డ్ ట్రంప్ చిత్తుచిత్తుగా ఓడిస్తా అన్నా బుక్ రాశా.. నా నోటి నుంచి వచ్చిన శాపాలు.. జీవితంలో దీవెనలుగా మారవు. మీ నాన్న మార్గంలో వెళ్తే నువ్వు కూడా నాశనం అయిపోతావు, గుర్తుంచుకో. మీ నాన్న, మీ తాత, మీ తల్లి, చెల్లి, బావ నా ఎదురుగా కూర్చుని ఆశీస్సులు తీసుకున్నవారు. కళ్లు నెత్తి కొచ్చాయా మీకు. ఎంత బాధపెడ్తున్నారు. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి ఆరంభించిన క్రికెట్ స్టేడియంకి 2000 మంది వచ్చినపుడు కరోనా లేదా?
దేవుని శాపానికి గురవుతున్నావు. నిన్ను అరెస్టు చేస్తుంటే అమిత్ షా, నడ్డా గారితో మాట్లాడానో లేదో కనుక్కో. మీరు కుళ్లు మనసుతో, ఒళ్లు కొవ్వెక్కిపోయి దేవుని కార్యాన్న ఆపావు. ట్రంప్, మైక్ పెన్స్, పెద్ద లీడర్లు నా దగ్గరకు రావడం మీరందరూ చూశారుగా. శాంతి కార్యాన్ని ఆపుతున్నారు. ఇలాగే మీ నాన్న చేశారు, ఇంకో ముఖ్యమంత్రి చేశారు. ఏమయ్యారో చూశావుగా.. ఒకరు పవర్‌లో నుండి పోయాడు, ఒకరు పైకే పోయారు. ఒళ్లు దగ్గరపెట్టుకోండి లేదా దేవుని శాపానికి మహరాజులే మసైపోయారు. ముఖ్యమంత్రలు, ప్రధానమంత్రులే మసైపోయారు. ఇప్పటికైనా మార్పు చెంది క్షమాపణ చెప్పి సరైన మార్గంలోకి వస్తే దేవుని దీవెన లభిస్తుంది లేదా ఈరోజు నుండి రోజులు లెక్కబెట్టండి.. ఏమవుతుందో చూసుకోండి.
ప్రజలారా మీరు మూర్ఖులు కాదు. రాష్ట్రానికి ట్రిలియన్స్ తేవాలని ఉంది. కానీ వారు చేయనివ్వట్లేదు.. వారు చేయట్లేదు. అందుకే ఇక గతి లేక రాజకీయాల్లోకి రావాలని ఉంది. మొన్నటికి మొన్న కేవలం వారం రోజులు ఉన్నాను. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, అందరికీ అధికారం, అవినీతి లేని రాజ్యం. జగన్మోహన రెడ్డి.. ఏంటా పోయేకాలం.. పోవాలని ఉందా. నాశనం అయిపోవాలని ఉందా. వినాశకాలే విపరీత బుద్ధి. నేను వస్తే.. ఇప్పుడున్న సమస్యలు తీసేసి ఆంధ్రాని అమెరికా చేసేద్దాం. ఈ రాజకీయ నాయకులు మాత్రం కళ్లు నెత్తికెక్కి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.. నాశనం చేస్తున్నారు. అందరూ ఒక్కటవ్వండి. అభివృద్ధి చేసి చూపిస్తా. డబ్బులు ఎక్కువై ఏం చేయాలో తెలియట్లే. అవి అందరికీ చేరాలంటే అధికారం కావాలి.
నా ప్రాణం మీకొరకు పెట్టడానికి రెడి. ప్రజాస్వామ్యంలో మీరు నోరు మూయలేరు. నాతో పెట్టుకుంటే.. దేవునితో పెట్టుకున్నట్టే. ఒక్కడు మిగల్లా.. 7 గురు పెట్టుకున్నారు. అందరూ ముక్కలై చచ్చారు. జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పాను. ఏ ఆఫీసరైనా ఇష్టం వచ్చినపుడు చేశారా.. 2007-09 వరకు పనిచేసిన వారి సంగతి ఏమైందో చూడండి. అందరూ పోయారు. మీరు పోతారు. మా జోలికి రాకండి. దేవుని శాపాలు వస్తాయి మీకు.
Must Read ;- సంపాదకీయం : అచేతనంగా జగన్!











