నవరసాలనే కథాంశంగా ఎంచుకుని తొమ్మిది విభాగాలుగా వెబ్ సిరీస్ రూపొంచే పనిని మణిరత్నం చేపట్టిన సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ కోసం ఆయన చేపట్టిన ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. ‘నవరస’ ఫస్ట్ లుక్ లో కూడా తొమ్మిది విభాగాలు కనిపించేలా జాగ్రత్త పడ్డారు. జయేంద్ర పంచపకేసన్ రచన ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. సూర్య, సిద్ధార్ఢ్, విజయ్ సేతుపతి తదితరులందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చారు. తొమ్మిది మంది దర్శకులు, తొమ్మిదిమంది నటులు, తొమ్మిది భాగాలు.. వెరసి‘నవరస’ వెబ్‌సిరీస్ లోనే ఓ కొత్త ఒరవడికి నాంది పలకబోతోంది.
అరవింద్ స్వామి కూడా ఓ ఎపిసోడ్ కు దర్శకత్వం వహించారు. బిజో నంబియార్, కేవీ ఆనంద్, గౌతమ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్, పొన్‌రామ్, హలిత షలీమ్, కార్తీక్ నరేన్, రతీంద్రన్ మిగిలిన ఎపిసోడ్లకు దర్శకత్వం వహిస్తున్నారు. రేవతి, సూర్య, విజయ్ సేతుపతి, సిద్ధార్థ, అరవిందస్వామి, నిత్యామీనన్, ఐశ్వర్యారాజేష్, రిత్విక, పూర్ణ, ప్రకాశ్‌రాజ్, బాబీసింహ, జై, స్నేహ తదితరులంతా నటిస్తున్నారు.
హాస్యం, శృంగారం, భయానకం, కరుణ, రౌద్రం, కోపం, ధైర్యం, అద్భుతం, బీభత్సం లాంటి నవరసాలన్నీ ఈ సిరీస్ లో ఉంటాయి. విజయ్ సేతుపతి తెరపై కొద్దిసేపు మాత్రమే కనిపిస్తారట. రతీంద్రన్ ఆర్. ప్రసాద్ తెరకెక్కించన కథలో సిద్ధార్త్ కనిపిస్తాడు. మరో విశేషం ఏమిటంటే మాధురీ దీక్షిత్ కూడా ఇందులో ఉండటం. మనిషిలోని భావోద్వేగాలన్నిటినీ ప్రతి ఫలించేలా ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ కోసం మణిరత్నం చేసిన ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందో చూడాలి.
Must Read ;- రోజా చేయలేకపోయినందుకు ఇప్పటికీ ఫీలవుతున్న హీరో