టాలీవుడ్ లో భారీ నిర్మాత ఎం.ఎస్.రాజు తన కుమారుడు సుమంత్ అశ్విన్ వివాహాన్ని ఘనంగా జరిపించారు. ఎం.ఎస్. రాజు స్థాపించిన సుమంత్ ఆర్ట్ష్ ను తన కుమారుడు పేరు మీదే నెలకొల్పి ఎన్నో భారీ చిత్రాలు నిర్మించారు. ఫిబ్రవరి 13వ తేదీ శనివారం రాత్రి హైదరాబాద్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో తనకు అత్యంత సన్నిహితులైన వారి సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. వధువు దీపిక మెడలో సుమంత్ మూడు ముళ్లు వేశారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలు ఈ వివాహానికి పెద్దగా హాజరుకాలేదు.

బంధువులను, సన్నిహిత మిత్రులను మాత్రమే ఈ వివాహానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. పెళ్లి ఫొటోలు మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సుమంత్ 2012లో హీరోగా వెండి తెరకు పరిచయమయ్యారు. ‘తూనీగ తూనీగ’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత మరికొన్ని చిత్రాలు కూడా చేశారు. ‘కేరింత’ చిత్రం మాత్రం అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. త్వరలో ‘ఇదే మా కథ’ చిత్రం విడుదల కాబోతోంది. వధువు దీపిక డల్లాస్ లో రీసెర్చ్ సైంటిస్ట్ అని తెలుస్తోంది.
Must Read ;- ‘ఇదే మా కథ’ అంటున్న శ్రీకాంత్, సుమంత్ అశ్విన్












