సినీ హీరో మంచు మనోజ్ కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.కారుకు బ్లాక్ ఫిల్మ్ కలిగి ఉన్నందున ఈ ఫైన్ విధించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోని టోలిచౌకీ వద్ద తనిఖీల్లో భాగంగా మనోజ్ కారును ఆపారు. బ్లాక్ ఫిల్మ్ కలిగి ఉండడంతో పోలీసులు మనోజ్ వాహనానికి 700 రూపాయల జరిమానా విధించి బ్లాక్ ఫిల్మ్ ను తొలగించారు.అయితే ఆ సమయంలో మనోజ్ కారులోనే ఉండడం విశేషం. ఇదిలా ఉంటే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ ల వాహనాలకు పోలీసులు ఇదే విధంగా ఫైన్ విధించి బ్లాక్ ఫిల్మ్ లు తొలగించారు. కాగా గత కొన్ని రోజులుగా వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ లు, స్టిక్కర్ లు తొలగించాలని పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తొలగించని వాహనాలకు జరిమానా కూడా విధిస్తున్నారు.
Must Read:-సామాజిక స్పందనలో ఇతడు ‘మంచి’ మనోజ్!