ఉద్యోగ నియామకాలపై గులాబీ బాస్ సీఎం కేసీఆర్‌కు, ఆయన తనయుడు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్‌లకు నిరుద్యోగుల నిరసన సెగలు తగులుతున్నాయి. జూన్21న వరంగల్‌లో కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు విద్యార్థులు, నిరుద్యోగులు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ‘కబడ్దార్ కేసీఆర్ ’ అంటూ నిరుద్యోగులు నినాదాలు చేశారు.
మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు..
ఈ రోజు నారాయణపేటలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, ఏబీవీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. లాఠీ ఛార్జి చేసి నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు పలువురు ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కాగా, మంత్రి కేటీఆర్ నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో పిల్లల ఐసీయూ వార్డును ప్రారంభించారు.
నీళ్లు, నియమాకాలంటూ..
తెలంగాణకు నీళ్లు, నియామకాలు అంటూ 2014లో టీఆర్‌ఎస్ అధికారం చేపట్టింది. ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాలు భర్తీ చేసి తెలంగాణ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ఆనాడు కేసీఆర్ హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడేళ్లు దాటుతున్నా ఎటువంటి నియామకాలు చేపట్టకపోవడంతో నిరుద్యోగులు వారి కాన్వాయ్‌లను అడ్డుకుని నిరసన తెలిపేందుకు యత్నిస్తున్నారు. కాగా, నిన్ననే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అయినా ఈ రోజు నారాయణపేటలో కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు.
Must Read ;- కేసీఆర్‌పై రేవంత్ సరికొత్త అస్త్రం రెడీ










