జాబ్ క్యాలెండర్ పై అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు లీడర్లు జగన్ సర్కారపై సెగలు కక్కుతున్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలకు దిగారు. వి వాంట్ జస్టీస్ నినాదాలను హోరెత్తించారు.
జాబ్ లెస్ క్యాలెండర్ వద్దని.. తిరుపతిలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. విశాఖలోని సీతమ్మధారలో మంత్రి అవంతి శ్రీనివాసరావు నివాసం ఎదుట ఏపీ నిరుద్యోగ జేఏసీ నిరసన చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవంతి ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. గుంటూరు, తిరుపతి, విజయవాడతోపాటు ఏపీ వ్యాప్తంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో.. పోలీసులు ఎక్కడిక్కడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఎక్కడికక్కడ మంత్రుల నివాసాల ముట్టడికి విద్యార్థులు యత్నించారు. వెరసి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
చదివింది ఎంటెక్.. నడిపేది ఆటో!
జగన్ ప్రభుత్వం విడుదల చేసింది జాబ్ క్యాలెండర్ కాదని.. జాబ్ లెస్ క్యాలెండర్ అని విద్యార్థులు మండిపడ్డారు. రాష్ట్రంలో లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే.. వేలల్లో పోస్టులు భర్తీ చేయడం ఏమిటని నిలదీశారు. ఎంటెక్ లాంటి ఉన్నత చదువులు చదవి.. నేడు ఆటోలు నడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో నిరుద్యోగులకు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న రెండు లక్షలకుపైగా ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది.
ఐటీ పాలసీ లేదు..
ఏపీ వ్యాప్తంగా నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల లీడర్లు ఆందోళన బాట పట్టడంపై మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖకు పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ‘‘నాడు నారా చంద్రబాబు నాయుడు.. విశాఖకి పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చారు. ప్రపంచ దిగ్గజాలని నగరానికి ఆహ్వానించారు. నేడు లులూ, డేటా సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఐబీఎంని పక్కరాష్ట్రాలకి తరలించారు. కనీసం ఐటీ పాలసీ లేదు.. విశాఖని ఐటీ నగరం చేస్తారా వైఎస్ జగన్?’’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.
Must Read ;- జాబ్ కావాలంటే.. బాబు రావాల్సిందే!
నాడు@ncbn విశాఖకి పరిశ్రమలు,పెట్టుబడులు తెచ్చారు.ప్రపంచదిగ్గజాలని నగరానికి ఆహ్వానించారు.నేడు లులూ,డేటాసెంటర్,ఫ్రాంక్లిన్ టెంపుల్టన్,ఐబీఎంని పక్కరాష్ట్రాలకి తరలించారు.ఉత్తరాంధ్ర యువతకి వేలఉద్యోగాలు లేకుండా చేసారు.మూడోఏడాదిలోకూడా కనీసం ఐటీ పాలసీలేదు.విశాఖనిఐటీనగరం చేస్తారా @ysjagan pic.twitter.com/axFLhWBKsa
— Devineni Uma (@DevineniUma) June 28, 2021











