చంద్రబాబునాయుడుపై పెట్టిన కేసులు వెనక్కు తీసుకోకపోతే దళిత రైతులందరం కలసి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లపై కేసులు పెడతామని దళిత నేత మార్టిన్ హెచ్చరించారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై అమరావతి జేఏసీ నేతులు మండిపడ్డారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం అంటే అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని జేఏసీ నేత మార్టిన్ అభిప్రాయపడ్డారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు చంద్రబాబుపై ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టే హక్కే లేదని ఆయన అన్నారు. చంద్రబాబుపై కేసులు వెనక్కు తీసుకోకుంటే రాజధానికి భూములిచ్చిన దళిత రైతులంతా ఆర్కేపై అట్రాసిటీ కేసులు పెడతామని మార్టిన్ హెచ్చరించారు.
ఎవరూ భూములు లాక్కోలేదన్న దళిత రైతులు
కొందరు రాజధాని దళిత రైతులు సీఐడీ ముందు హాజరై స్వచ్ఛందంగా భూములిచ్చామని చెప్పారు. తమ వద్ద నుంచి ఎవరూ భూములు లాక్కోలేదని, తమను ఎవరూ భూములు ఇవ్వాలని బెదిరించలేదని రైతులు తెలిపారు. అయితే అసైన్డ్ భూముల విషయంలో గత ప్రభుత్వం తీరు వల్ల నష్టపోయామని ఫిర్యాదు చేసిన రైతుల వద్ద నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.
Must Read ;- అవీ అసైన్డ్ భూములేగా.. జగన్‌పై కూడ కేసు పెట్టాలన్న హర్షకుమార్