Umbrella Took The Life Of A Young Man :
మనిషి జీవితం నీటి బుడగ లాంటింది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇంటి నుంచి బయట అడుగు పెట్టిన మనిషి.. తిరిగి క్షేమంగా వస్తాడనే గ్యారంటీ లేని జీవితాలు ఇవి. వర్షానికి రక్షణ ఇచ్చే గొడుగే.. ఓ యువకుడి ప్రాణం తీసిందంటే మీరు నమ్ముతారా..?
గొడుగు ప్రాణం తీసింది
మొడియం శివ (28) నరసాపురంలోని మర్రిగూడెం, సున్నపురాళ్లపల్లిలో నివసిస్తున్నాడు. గ్రామవాలంటీర్ గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరగా ఉంటున్నాడు. సోమవారం తన పొలంలో వరి నాట్లు వేసేందుకు గొడుగు తీసుకొని వెళ్లాడు. పొలానికి వెళ్లే క్రమంలో.. గొడుగు పైభాగం విద్యుత్ తీగలకు తగిలాయి. దీంతో విద్యుత్ షాక్ తగిలి.. అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబానికి ఆధారమైన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. యువకుడి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
షాక్ తగిలితే..
గత వారంరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ స్తంభాల దగ్గర రక్షణ చర్యలు లేకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు.. రోజువారి పనులు చేసే కూలీలు.. భారీ నిర్మాణాలు చేసే వర్కర్స్ జాగ్రత్తగా ఉండాలని విద్యుత్ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ ఘాతానికి గురైతే వెంటనే మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. పొడి కర్రతో గానీ, విద్యుత్ ప్రవహించని ఇతర ప్లాస్టిక్ వస్తువులతో గానీ సదరు వ్యక్తిని తప్పించాలి. తక్షణమే 108కి సమాచారం అందించాలి. విద్యుత్ తీగలు తెగిపడ్డా, వేలాడుతున్నా సమీపంలోని విద్యుత్ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లాని కోరుతున్నారు.
మరికొన్ని జాగ్రత్తలు
- చేతులు తడిగా ఉన్నప్పుడు విద్యుత్ పరికరాలు, స్విచ్‌లను తాకవద్దు.
- ఇంటి వైరింగ్‌కు ఎర్తింగ్ తప్పనిసరి.
- అతికించిన తీగలను అసలే వాడొద్దు.
- స్విచాఫ్ చేయకుండా ఫ్లగ్ లను బయటకు తీయొద్దు.
- విద్యుత్ పరికరాలకు ఉన్న తీగలను పట్టుకొని లాగొద్దు.
- భవనాలను నీటితో తడుపుతున్నప్పుడు తీగలను, విద్యుత్ పరికరాలను గమనించాలి.
- దుస్తులు ఆరవేసేందుకు ఇనుపతీగలను ఉపయోగించ వద్దు.
- Must Read ;- దిలీప్ కుమార్ జీవితంలో విషాదాంత ‘మధు’రిమలు











