June 8, 2026 9:28 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

దిలీప్ కుమార్ జీవితంలో విషాదాంత ‘మధు’రిమలు

జీవితంలో లేని ప్రేమ సినిమాల్లో మాత్రం ఎందుకుంటుంది. ప్రేమ కథలకు జనం పట్టాభిషేకం చేసిన సందర్భాలు ఎన్నో. అలాంటి అజరామర ప్రేమ కథల్లో నటించిన దిలీప్ కుమార్, మధుబాల మధ్య ఆసక్తికర ప్రేమ కథ ఎలా సాగిందో తెలుసకుందాం.

July 12, 2021 at 7:19 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సినిమా రంగంలో అజరామర ప్రేమ కథలు ఎన్నో వచ్చాయి. చిరస్థాయిగా నిలిచిపోయేది విషాదాంత ప్రేమ కథలే. చరిత్రలో నిలిచిపోయిన ప్రేమ కథల్ని తెరపై ఆవిష్కరించిన తారల జీవితంలోని ప్రేమ మాత్రం తెరవెనకే ఉండిపోయింది.

తారల ప్రేమను తెర మీద ఆవిష్కరిస్తే మరో అజరామర ప్రేమ కథే అవుతుంది. అలాంటి ప్రయత్నాన్ని మాత్రం ఇంతవరకూ ఎవరూ చేయలేదు. ఇంతకీ ఆ జంట ఎవరో తెలుసా? బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్, వీనస్ ఆఫ్ ఇండియన్ స్క్రీన్ మధుబాల. వెండి తెరపై దేదీప్య మానంగా వెలిగిన మధుబాల జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. దిలీప్ కుమార్ ఇటీవల కన్నుమూశారు. మరి వీరి మధ్య ప్రేమ కథ ఎలాంటిదో తెలుసుకుందాం.
ప్రేమికుల రోజుతో ‘మధు’ బంధం ప్రేమికుల రోజు అంటే ఫిబ్రవరి 14 అనే అందరికీ తెలుసు. అలాంటి ప్రేమికుల రోజునే మధుబాల పుట్టింది.

11 మంది సంతానంలో ఆమె ఐదవది. అమాయకత్వంతో కూడిన అందం ఆమెది. కానీ చిన్నప్పటి నుంచి అనారోగ్యం ఆమెను వెంటాడింది. దిలీప్ కుమార్ విషయానికి వస్తే అతని నవ్వు శవానికి కూడా ప్రాణం పోస్తుందంటారు. పఠాన్ కుటుంబంలో పేదరికంలో పుట్టాడు దిలీప్ కుమార్. ‘బసంత్’ అనే సినిమా ద్వారా బాల నటిగా సినిమా రంగ ప్రవేశం జరిగింది. హీరోయిన్ గా ఆమెను తెరకు పరిచయం చేసింది మాత్రం దర్శకుడు కేదార్ శర్మ. రాజ్ కుమార్ హీరోగా రూపొందిన ‘నీల్ కమల్’ చిత్రమది. ఈ సినిమా తర్వాతే ఆమెను అందాల దేవతగా అందరూ గుర్తించారు.

దిలీప్ గుండెల్లో విరిసిన ప్రేమ గులాబీ

దిలీప్ కుమార్, మధుబాల మధ్య ప్రేమ గులాబీ రంగు లేఖతో మొదలైందని చెబుతుంటారు. వీరిద్దరూ ‘తరానా’ సినిమాలో జంటగా నటించారు. 1951లో ఈ సినిమా విడుదలైంది. వీరి మధ్య ప్రేమకు ఈ సినిమానే కారణమైంది. వీరి ప్రేమ వ్యక్తమైంది కూడా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే. తనకు తెలియకుండానే దిలీప్ తో ఆమె ప్రేమలో పడిపోయింది. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే మేకప్ మన్ తో ఓ గులాబీ రంగు ప్రేమ లేఖను ఆమె దిలీప్ కు పంపిందని చెబుతారు. దాన్ని ఆమె ఉర్దూలో రాసింది.

Must Read ;- దేవదాసు.. ఇది క్లాసిక్ మాత్రమే కాదు, ఓ చరిత్ర

Dilip Kumar Mughal E Azam

అందులో ఆమె ఏం రాసిందో తెలుసా?.. ‘మీరు కావాలనుకుంటే ఈ రోజాను తీసుకోవచ్చు.. వద్దనుకుంటే తిరిగి ఇచ్చేయవచ్చు’.. ఇదీ ఆమె పంపిన ప్రేమ సందేశం. అందాల సుందరి ప్రేమను వ్యక్తం చేస్తే ఎవరు మాత్రం తిరస్కరిస్తారు. దిలీప్ ఆమె ప్రేమను స్వీకరించారు. ఇక తర్వాత వీరి ప్రేమపై పుకార్ల వరద పారింది. ఏ ప్రేమ కథలో నైనా విలన్ ఉండక తప్పదు. ఇందులో విలన్ ఆమె తండ్రి అతౌల్లా ఖాన్. ఇంటికి మంచి ఆదాయ వనరు

మధుబాల మాత్రమే. దిలీప్ తో ఆమె ప్రేమలో పడటం అతనికి ఇష్టం లేదు. వీరి పెళ్లికి అతను ససేమిరా అన్నాడు. దాంతో దిలీప్ ఆమె ముందు ఓ ప్రతిపాదన ఉంచాడు. అదేమిటంటే అతన్ని మధుబాల పెళ్లిచేసుకుంటే తండ్రితో ఆమె సంబంధ బాంధవ్యాలను తెంచుకోవాలి. ఇద్దరూ విడిపోవడానికి ఇదే కారణం. దిలీప్ తో మొదలైన మధుబాల ప్రేమ కిషోర్ కుమార్ తో జరిగిన పెళ్లితో శుభం కార్డు పడింది.

ఎన్నో పుకార్లు షికార్డు

మధు బాల ప్రేమ దిలీప్ తో పెనవేసుకుపోయినా ఆమె గురించి ఎన్నో పుకార్డు షికారు చేశారు. చిత్ర నిర్మాత కమల్ అమ్రోహి, దర్శకుడు కేదార్ శర్మ, నటుడు ప్రేమ్ నాథ్ లతోనూ ఆమె చెట్టపట్టాలేసుకు తిరుగుతోందని వదంతులు రాజ్యమేలాయి. చివరికి మల్టీ టాలెంట్ పర్సన్ కిషోర్ కుమార్ వద్ద ఆమె ప్రేమ ప్రయాణం ఆగిపోయింది. ఎన్ని ప్రేమలున్నా ఆ మొఘల్ ఏ ఆజమ్’ బంధమే వేరు. రాజ దర్భారులో సలీమ్ ‘ప్యార్ కియాతో డర్ నా క్యా’ అంటూ ధైర్యంగా ప్రకటించినప్పుడు సెహెన్ షా అక్బర్ ను అనార్కలి ధిక్కరించి ఉండొచ్చు.

అది రీల్ ప్రేమ కాబట్టి అలా జరిగిందేమో.. రియల్ ప్రేమ వేరు కదా అందుకే తండ్రి మాటను మధు బాల జవదాటలేకపోయింది.1956లో ‘ధాకే కి మల్మాల్’ లో హీరోయిన్ గా నటిస్తున్న మధుబాల దగ్గరకు వచ్చి పెళ్లిపై దిలీప్ కుమార్ అనేక సార్లు ప్రతిపాదనలు తెచ్చినా ఫలితం లేకపోయింది.1957లో వచ్చిన ‘నయా దౌర్’ షూటింగ్ సందర్భంగానే వీరి ప్రేమకు ఫుల్ స్టాప్ పడిపోయింది.

గ్వాలియర్ సమీపంలో షూటింగ్ జరగాలి. అదే ప్రాంతంలో జబీన్ జలీల్ నటించిన మరో సినిమా షూటింగ్ జరుగుతోంది. దాంతో అక్కడి గుంపు ఆ సినిమా యూనిట్ లోని మహిళలపై దాడి చేసి బట్టలు కూడా చించివేసింది. మధుబాల తండ్రి అక్కడ షూటింగ్ వద్దని అన్నారు. కాని నిర్మాత దివంగత బి.ఆర్. చోప్రా వినలేదు. పైగా అందులో నటించాల్సిన మధుబాలను తప్పించి ఆ స్థానంలో వైజయంతిమాలను తీసుకున్నారు. దాంతో మధుబాల తండ్రి దర్శకుడిపై కేసు పెట్టారు. బాల్ కోర్టుకు చేరింది. దిలీప్ కుమార్ బి.ఆర్. చోప్రాకు అండగా నిలిచారు.

Also Read ;- అసమానం.. అజరామరం దిలీప్ కుమార్ నటన

దిలీప్ లోని అహంకారమే ప్రేమను భగ్నం చేసిందా?

ప్రేమ ఉన్నప్పుడు వైరం ఉండకూడదు. మధు, దిలీప్ ల మధ్య ఎడబాటు అంతకంతకూ పెరిగింది. దీనికి కారణం దిలీప్ కుమార్ లోని అహంకారమే అంది మధుబాల సోదరి మాధుర్. దిలీప్ ను కోల్పోతున్నందుకు మధు ఎప్పుడూ ఏడుస్తూ ఉండేదట. ‘మీ నాన్నను వదులుకుంటేనే నేను నిన్ను పెళ్లాడతా’ అనే వారట దిలీప్ కుమార్. మధు తండ్రి మాత్రం దిలీప్ ను క్షమాపణ కూడా కోరలేదు. అతనితో ఉన్న బంధాన్ని తెంచుకోమని కూడా మధును అనలేదు. మధు తండ్రి కోణంలో చూస్తే వీరి వివాహం ఓ వ్యాపార ఒప్పందం.

దిలీప్, మధుల మధ్య నిశ్చితార్థం కూడా అప్పటికే జరిగిపోయిందట. ఇద్దరూ కలిసి చెట్టపట్టాలేసుకు తిరిగారు. ‘మొఘల్-ఎ-అజామ్’ షూటింగ్ చాలా కాలం సాగింది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఇద్దరి మధ్యా వైరం బయలు దేరింది. ఒక దశలో ఇద్దరి మధ్యా మాటలు కూడా లేవు. ఇద్దరినీ కలపడానికి దర్శకుడు ఆసిఫ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సినీ చరిత్రలో ఐకానిక్ గా భావించే ఈ సినిమా శృంగారభరిత సన్నివేశాల చిత్రీకరణ సమయంలో వీరి మధ్య మాత్రం ద్వేషం తప్ప ప్రేమ లేదు.

ఓ సన్నివేశంలో అనార్కలిని సలీం చెంప దెబ్బ కొట్టాల్సి వచ్చిందట. ఆ సన్నివేశం చిత్రీకరణ సమయంలో దిలీప్ తన కోపాన్ని అణుచుకోలేకపోయాడు. లాగిపెట్టి కొట్టినప్పుడు ఆమె కూడా తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేకపోయింది. చివరికి దిలీప్ వివాహం సైరాభానుతో జరిగిపోయింది. ఈ పెళ్లి తనకెంతో సంతోషం కలిగించిందని మధుబాల చెప్పేదని ఆమె సోదరి మాధుర్ ఓ ఇంటర్వ్యూలో అంది. ఎంతో అందమైన అమ్మాయిని దిలీప్ కుమార్ చేసుకున్నా మధు హృదయంలో మాత్రం శూన్యత అలాగే ఉందట.

వెంట్రిక్యులర్ సెప్టల్ లోపంతో మధు బాల బాధపడేది. ఆమె ముక్కు, నోటి నుంచి రక్తం పడేది. దానికి తోడు ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడింది. తరచూ ఆక్సిజన్ అందివ్వాల్సి వచ్చేది. దాంతో ఆమె అసమానమైన అందం మసకబారిపోయింది. 36 ఏళ్ల వయసులో 1969 ఫిబ్రవరి 23న కన్నుమూసింది.ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు దిలీప్ ఆమెను పరామర్శించడానికి కూడా రాలేదు.

చనిపోయినప్పుడు మాత్రం శ్రద్దాంజలి ఘటించడానికి మద్రాసు నుంచి బయలుదేరి శ్మశాన వాటికకు వచ్చారు. ఆచారం ప్రకారం మూడు రోజుల పాటు తన ఇంటి నుంచి అక్కడికి ఆహారాన్ని కూడా పంపే ఏర్పాటుచేశారు. వీరిద్దరూ భౌతికంగా ఇప్పుడు మన మధ్య లేకపోయినా వీరి ప్రేమ గాథ మాత్రం అభిమానుల గుండెల్లో నిలిచే ఉంటుంది. దీనికి తెరరూపం వస్తే తెలుగులో ‘మహానటి’లాంటి చిత్రమవుతుంది. వధ శాల మీదే మధుబాల జీవితం సాగింది. ఇలాంటి విషాదాంత ప్రేమ కథలే ఎప్పటికీ జనం గుండెల్లో నిలిచి ఉంటాయి.

– హేమసుందర్ పామర్తి

Tags: leotoplove story of dilip kumar and madhubalamadhubala love story
Previous Post

సీఐడీకి ఫైబ‌ర్‌ కేసు.. మ‌రో భంగపాటు రెడీ

Next Post

సొంత ఖర్చుతో ‘మా’ భవనం కడతానంటున్న విష్ణు

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నలుగురు టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

జగన్‌ను దేవుడితో పోలుస్తారా.. చంద్రబాబు ఫైర్

ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా మరో ఘోస్ట్

పెద్దోళ్ల జోలికెళ్లకుండా.. చిన్నోళ్ల మీదనే కేసులా?

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సుధాకర్ తనయుడు

ఈ యంగ్ హీరో చూపు ఓటీటీల పైపు.. !

రామతీర్ధంలో కేసులో.. A1గా చంద్రబాబు!

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist