భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునే నిమిత్తం బీజేపీ కీలక నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం శ్రీశైలానికి వచ్చారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, బీజేపీ తరఫున ఆ పార్టీ ఏపీ శాఖ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీలు కూడా ప్రొటోకాల్ ప్రకారం అమిత్ షాకు వెల్ కమ్ చెప్పారు.
దర్శనాంతరం తిరుగుపయనం
మల్లన్న దర్శనార్థం గురువారం ఉదయమే హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా కుటుంబం.. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో సున్నిపెంటకు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునుడి దర్శనార్థం ఆలయానికి వెళ్లారు. ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. దర్శనానంతరం ఆయన భ్రమరాంబ అతిథి గృహానికి చేరుకుని అక్కడే భోజనం చేయనున్నారు. తిరిగి హైదరాబాద్ కు వెళ్లి అక్కడి నుంచి 3.50 గంటలకు ఢిల్లీకి బయల్దేరతారు.
హడావిడే లేదబ్బా
శ్రీశైలానికి అమిత్ షా వచ్చిన సందర్భంగా బీజేపీలో జగన్ కొనసాగిస్తున్న స్నేహ సంబంధాలను చూస్తే.. అమిత్ షాకు ఓ రేంజిలో వెల్ కమ్ దక్కుతుందని అంతా భావించారు. అయితే ఏమనుకున్నారో, ఏమో తెలియదు గానీ.. అమిత్ షాకు సాదాసీదా స్వాగతమే లభించింది. కేంద్ర హోం మంత్రి వస్తున్నారంటే.. సంబంధిత శాఖ మంత్రితో పాటు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాత్రమే వెల్ కమ్ చెప్పించిన జగన్ సర్కారు పెద్దగా హడావిడే చేయలేదు,. బీజేపీతో వైసీపీ బంధం సన్నగిల్లుతున్న నేపథ్యంలో అమిత్ షాను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న భావనలోనే జగన్ సర్కారు కదిలినట్లు సమాచారం.
Must Read ;- జగన్ కేసులపై సుప్రీంలో ప్రత్యేక ధర్మాసనం











