అమరావతితో మూడు ముక్కలాట ఆడుకుంటోంది ఏపీ ప్రభుత్వం. అభివృద్ధిని సాకుగా చూపి, ఆంధ్రులు కలల రాజధాని అమరావతిని ముక్కలు చెక్కలు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఎన్ని అభ్యంతరాలు వెల్లడవుతున్న లెక్కచేయకుండా ముందుకెళ్తుంది. కేంద్రం దీనికి అడ్డుకట్ట వేయగలదని కొందరు అభిప్రాయపడుతున్నా కూడా.. మూడు రాజధానుల విషయంలో మౌనం వహిస్తూ కేంద్రం ప్రేక్షక పోషిస్తుంది. తాజాగా రాజ్యసభలో మూడు రాజధానులపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజ్యసభలో జీవీఎల్ లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నారా అని అడగగా.. కోర్టు-ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే హైకోర్టును కర్నూలు తరలించే విషయంపై, మూడు రాజధానల విషయంలో కూడా నిర్ణయాన్ని వెల్లడించగలమని తెలిపింది. ఎందుకంటే, కోర్టు అంతర్గత నిర్వహణ బాధ్యత స్థానిక రాష్ట్ర ప్రభుత్వానికి అవుతుంది గనక, వారితో సంప్రదించకుండా ఏమి చెప్పలేమని తేల్చి చెప్పింది. పరిపాలనా బాధ్యతలు మాత్రం న్యాయమూర్తి పరిధిలో ఉంటాయని చెప్పారు కేంద్ర మంత్రి. హైకోర్టు-రాష్ట్ర ప్రభుత్వం ఏకాభిప్రాయానికి రాకుండా ఈ విషయంపై నిర్ణయం కష్టమని వ్యాఖ్యానించారు.
Must Read ;- విశాఖ రాజధానికి.. మోడీ సర్కార్ జై అంటున్నట్టేనా?