స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ఇది. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. బన్నీ ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న సినిమా ఐకాన్. ఈ సినిమా కథను ఎప్పుడో విన్నాడు. కథ నచ్చి ఖచ్చితంగా సినిమా చేస్తానని బన్నీ మాట ఇచ్చాడు కానీ.. ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు.
దీంతో అసలు ఐకాన్ మూవీ ఉందా..? లేదా..? అనే అనుమానాలు కూడా వచ్చాయి. అలా అనుమానాలు వచ్చిన ప్రతిసారీ ఐకాన్ మూవీ కచ్చితంగా ఉంటుంది అని బన్నీ క్లారిటీ ఇచ్చేవారు. దసరాకి ఐకాన్ స్టార్ట్ అవుతుందని ఆమధ్య వార్తలు గట్టిగా వినిపించాయి. దసరా వచ్చింది.. వెళ్లింది కానీ.. ఐకాన్ మాత్రం స్టార్ట్ కాలేదు. దీంతో ఐకాన్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ ఐకాన్ ఉందా? లేదా..? అని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే.. ప్రస్తుతం అల్లు అర్జున్ దృష్టి అంతా పుష్ప సినిమా పైనే ఉందట.
పుష్ప షూటింగ్ చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నవంబరుకు పుష్పకి సంబంధించిన వర్క్ పూర్తిగా కంప్లీట్ చేస్తాడట. ఆ తర్వాత ఐకాన్ గురించి ఆలోచిస్తాడట. త్వరలోనే ఐకాన్ మూవీని అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. ఈ భారీ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు. డిసెంబరు నుంచి ఐకాన్ షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరి.. త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.










