పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వేణుశ్రీరామ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ క్రేజీ మూవీ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అయ్యప్పనున్ కోషియమ్ రీమేక్, క్రిష్ తో చేస్తున్న మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.
అలాగే హరీష్ శంకర్ తో మూవీ, సురేందర్ రెడ్డితో మూవీ కూడా చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే..మరో వైపు పవన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మించాలి అనుకుంటున్నారని తెలిసింది. పవన్ తన బ్యానర్ లో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి స్టార్ రైటర్ కోన వెంకట్ కథ అందించనున్నారని తెలిసింది.
కోన చెప్పిన కథ పవన్ కి బాగా నచ్చిందట. ఈ కథ వరుణ్ తేజ్ కి అయితే.. కరెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పి వరుణ్ తో తీద్దమాని చెప్పారట. అయితే.. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. డైరెక్టర్ ఎవరు అనేది ఫైనల్ అయిన తర్వాత పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. మరో విషయం ఏంటంటే.. ఈ బ్యానర్ లో మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ కోసం కథ ఉంటే చెప్పమని కొంత మంది దర్శకులుకు, రచయితలకు చెప్పినట్టు సమాచారం.
Must Read ;- షూటింగ్ లో పాల్గొన్న పవన్.. ఇంతకీ.. ఏ మూవీ?