శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ కథానాయకుడిగా ‘నారప్ప’ సినిమా రూపొందింది. తమిళంలో హిట్ కొట్టిన ‘అసురన్’కి ఇది రీమేక్. సురేశ్ బాబు – కలైపులి థాను కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన ఈ సినిమాకి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయగా వెంకటేశ్ మాట్లాడారు. ‘నారప్ప‘కు ఘన విజయాన్ని కట్టబెట్టిన తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా చూసిన వాళ్లంతా చాలా బాగుందని అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.
ఇన్నేళ్ల నా కెరియర్లో ఇంతవరకూ ఎన్నో సినిమాలు .. ఎన్నో పాత్రలు చేశాను. కానీ ఈ ‘నారప్ప’ నాకు ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఇంతమంచి కథను ఇచ్చినందుకు వెట్రి మారన్ కు .. ధనుశ్ కు నేను థ్యాంక్స్ చెబుతున్నాను. నేను అనుకున్నట్టుగానే తెలుగు ఆడియన్స్ కి ఈ కథ కొత్తగా అనిపించింది. ఆ కొత్తదనం కారణంగానే ఇంతలా ఆదరిస్తున్నారు. ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి నాతో పాటు పనిచేసిన అందరూ కారకులే. ‘నారప్ప’ కోసం ఒకే కాస్ట్యూమ్ లో ఎక్కువ రోజులు ఉంటూ ఏకధాటిగా షూటింగులో పాల్గొన్నాను .. అదే ఈ సినిమా ప్రత్యేకత.
ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కావడం నాకు కొత్తగా అనిపించింది .. ఈ అనుభవం కొత్తగానే ఉంది. ఓటీటీ ద్వారా ఈ స్థాయి రెస్పాన్స్ రావడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా చాలా గొప్పగా ఉందంటూ తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేయనందుకు ఫ్యాన్స్ బాధపడినప్పటికీ, ఆ తరువాత పరిస్థితిని అర్థం చేసుకుని ఎంజాయ్ చేశారు. ‘ఎఫ్ 3’ థియేటర్లకే వస్తుంది .. ఆ సినిమాతో మీకు నవ్వులే నవ్వులు. సంక్రాంతికి రానున్న ఆ సినిమాతో సందడి చేద్దాం” అంటూ నవ్వేశారు.
Must Read ;- ఎఫ్ 3లో బాలయ్య హీరోయిన్స్











